Friday, August 22Lend a hand to save the Planet
Shadow

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎల‌క్ట్రిక్ కారు ఇదే..

Spread the love

MG Windsor EV | టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా & మహీంద్రాతో సహా దేశంలోని ప్రధాన కార్ల తయారీదారులు EV మార్కెట్ లో ఆదిప‌త్యం కోసం పోటీ ప‌డుతున్నాయి. అయితే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన EV ఈ కంపెనీల నుంచి రాలేదు. మార్కెట్ డేటా ప్రకారం కొత్త వ‌చ్చిన‌ MG విండ్సర్ EV అక్టోబర్ 2024 నుంచి వరుసగా మూడు నెలల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది. ఈ మూడు నెల‌ల్లో 10,000 యూనిట్లకు పైగా విక్రయించింది ఎంజీ కంపెపీ.. JSW MG మోటార్ ఇండియా ప్రకారం.. MG విండ్సర్ EV డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లను విక్రయించింది, ప్యాసింజర్ వాహన విభాగంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన EVగా అగ్రస్థానాన్ని నిలుపుకుంది.

మూడు నెలల్లో 10వేల యూనిట్స్

అక్టోబర్‌లో MG విండ్సర్ EV 3,116 యూనిట్లు, నవంబర్ 2024లో 3,144 యూనిట్లను విక్రయించిందని, వరుసగా మూడు నెలల పాటు ఈ విభాగంలో బెస్ట్ సెల్లర్‌గా అవతరించిందని, ఈ సమయంలో మొత్తం 10,045 యూనిట్లు విక్రయించామని వాహన తయారీ సంస్థ తెలిపింది.

దేశంలో అమ్ముడ‌వుతున్న మొత్తం కార్లలో 3% కంటే తక్కువ ఎలక్ట్రిక్ వాహనాలతో భారతదేశ EV మార్కెట్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న ద‌శ‌లోనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

MG Windsor EV ధర

MG Windsor EV Price in India : ధర రూ. 13.50 లక్షల నుంచి రూ. 15.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒక ఛార్జ్‌పై 332 కిమీ (ARAI- సర్టిఫైడ్) రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వినియోగదారుడు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌లో యూనిట్‌ను కొనుగోలు చేయడానికి ఎంచుకుంటే, కారు ధర రూ. 9.99 లక్షలు + కిలోమీటరుకు రూ. 3.5 బ్యాటరీ అద్దెకు తగ్గుతుంది.

కాగా ఎంజీ కామెట్ EV, ఎంజీ ZS EVలను తయారు చేసే JSW MG, సెప్టెంబర్ 2024లో MG విండ్సర్ EVని విడుదల చేసింది. డెలివరీలు అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీ ప్రకారం ఇది డిసెంబర్ 2024లో మొత్తం 7,516 యూనిట్లను విక్రయించింది, ఇది సంవత్సరానికి 55% వృద్ధిని నమోదు చేసింది, నెలల్లో దాని మొత్తం కార్ల అమ్మకాలలో EVలు 70% పైగా ఉన్నాయి.

టాటా మోటార్స్ కు గట్టి పోటీ

ఇదిలా ఉండ‌గా భారతదేశపు అతిపెద్ద EV తయారీదారు అయిన టాటా మోటార్స్, 2024లో వరుసగా రెండవ సంవత్సరం 100,000 యూనిట్ల EVలను విక్రయించాలనే ఉద్దేశ్య లక్ష్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
కాగా MG విండ్సర్ EV ఒక మిడిల్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనం. ప్రస్తుతం దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థి లేదు, అయితే ఇది Tata Tiago.ev, Tata Punch.ev, Tata Nexon, Tata Curvv.ev, వంటి తక్కువ ధర కలిగిన కార్లను కలిగి ఉన్న బడ్జెట్ EV విభాగంలో మహీంద్రా XUV400 సిట్రోయెన్ E-C3 నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు