PM Kisan Yojana : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (PM Modi) రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. తాజాగా పీఎం కిసాన్ పథకంక కింద రైతుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేయాలని నిర్ణయించింది. దీంతో నేరుగా రైతులకు లబ్ది చేకూరనుంది..
వ్యవసాయ పనుల కోసం రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా దేశంలోని అర్హులైన రైతులందరికీ పంట సాయం కింద ఏడాదికి 6 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. దీంతో ఈ పథకంపై దేశవ్యాప్తంగా రైతులకు నేరగా సాయం అందుతుంది . ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ యోజన స్కీముకు సంబంధించి కీలక సమాచారం బయటకు వొచ్చింది. ఈ స్కీము కింద రైతులకు మరింత లబ్ది చేకూరే విధంగా కొత్త ప్లాన్ రెడీ చేసిందని తెలుస్తోంది. పీఎం కిసాన్ కింద ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచాలని భావించి అందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పీఎం కిసాన్ యోజన పథకం (PM Kisan Yojana Scheme ) కింద రైతులకు అందించే వార్షిక మొత్తాన్ని రూ. 6వేల నుంచి 10వేలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 1, 2025న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ లో కీలక నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న 6వేల రూపాయలను మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. ఏప్రిల్, జులై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో ప్రతి విడతలో ఎకరానికి రూ.2వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు 18 విడతలుగా నగదు విడుదల చేశారు. ప్రస్తుతం రైతులు 19వ విడత డబ్బు 2025 ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..