Model Solar City | రామ జన్మభూమి అయోధ్యను “మోడల్ సోలార్ సిటీ (Model Solar City)”గా అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని, దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. అయోధ్య తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశంలోని మరో 16 నగరాలను ప్రభుత్వం గుర్తించిందని ఆయన సోమవారం వెల్లడించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య రాముడి జన్మస్థలం. అతడు సూర్యవంశీ. (Ayodhya) రాముడి అద్భుతమైన ఆలయం నిర్మించాం. అయితే అయోధ్య ఒక మోడల్ సోలార్ సిటీ లక్ష్యంతో ముందుకుసాగుతోందని తెలిపారు. దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తోందని ప్రధాని మోదీ అన్నారు.“అయోధ్యలోని ప్రతి ఇల్లు సౌరశక్తితో నడపాలన్నదే మా ప్రయత్నం. మేము ఇప్పటివరకు అనేక ప్రాంతాలను సౌరశక్తితో అనుసంధానించాం. దేశంలోని 17 నగరాలను (Model Solar City) సోలార్ సిటీలుగా అభివృద్ధి చేయగలమని గుర్తించాం’’ అని ఆయన చెప్పారు.
పర్యావరణ హితమైన హరిత భవిష్యత్తు కోసం తాము నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు. నేటి భారతదేశం రాబోయే 1000 సంవత్సరాలకు పునాదిని సృష్టిస్తోంది” అని ఆయన అన్నారు. “మా లక్ష్యం అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, అగ్రస్థానంలో నిలదొక్కుకోవడం కూడా. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారతదేశానికి దాని శక్తి అవసరాలు తెలుసు. మన స్వంత చమురు, గ్యాస్ నిల్వలు లేవని కూడా మనకు తెలుసు… కాబట్టి మేము మన భవిష్యత్తును సౌర, పవన, అణు, జల శక్తులపై నిర్మించాలని నిర్ణయించుకున్నాము.. ’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..