Harithamithra Telugu News

Home General News Model Solar City | సోలార్ సిటీగా అయోధ్య.. దేశవ్యాప్తంగా మరో 17 నగరాల ఎంపిక

Model Solar City | సోలార్ సిటీగా అయోధ్య.. దేశవ్యాప్తంగా మరో 17 నగరాల ఎంపిక

0
Model Solar City
Model Solar City

Model Solar City | రామ జన్మభూమి అయోధ్యను “మోడల్ సోలార్ సిటీ (Model Solar City)”గా అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని, దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. అయోధ్య తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశంలోని మరో 16 నగరాలను ప్రభుత్వం గుర్తించిందని ఆయన సోమవారం వెల్లడించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

అయోధ్య రాముడి జన్మస్థలం. అతడు సూర్యవంశీ. (Ayodhya) రాముడి అద్భుతమైన ఆలయం నిర్మించాం. అయితే అయోధ్య ఒక మోడల్ సోలార్ సిటీ లక్ష్యంతో ముందుకుసాగుతోందని తెలిపారు. దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తోందని ప్రధాని మోదీ అన్నారు.“అయోధ్యలోని ప్రతి ఇల్లు సౌరశక్తితో నడపాలన్నదే మా ప్రయత్నం. మేము ఇప్పటివరకు అనేక ప్రాంతాలను సౌరశక్తితో అనుసంధానించాం. దేశంలోని 17 నగరాలను (Model Solar City)  సోలార్ సిటీలుగా అభివృద్ధి చేయగలమని గుర్తించాం’’ అని ఆయన చెప్పారు.

పర్యావరణ హితమైన హరిత భవిష్యత్తు కోసం తాము నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు. నేటి భారతదేశం రాబోయే 1000 సంవత్సరాలకు పునాదిని సృష్టిస్తోంది” అని ఆయన అన్నారు. “మా లక్ష్యం అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, అగ్రస్థానంలో నిలదొక్కుకోవడం కూడా. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారతదేశానికి దాని శక్తి అవసరాలు తెలుసు. మన స్వంత చమురు, గ్యాస్ నిల్వలు లేవని కూడా మనకు తెలుసు… కాబట్టి మేము మన భవిష్యత్తును సౌర, పవన, అణు, జల శక్తులపై నిర్మించాలని నిర్ణయించుకున్నాము.. ’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Previous articleKharif Season | దెబ్బ‌తీసిన వ‌ర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు
Next articleAgri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here