BLive, CBPL సంస్థల మద్య కీలక ఒప్పందం
mou-between-blive-chartered-bike : మల్టీ -బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్ అయిన BLive, పబ్లిక్ బైక్ షేరింగ్, క్యాంపస్‌లో మొబిలిటీ, ఇ-కామర్స్ డెలివరీ లాస్ట్ మైల్ డెలివరీ సేవలలో ప్రత్యేకత కలిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ అయిన చార్టర్డ్ బైక్ Chartered Bike (CBPL) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ రెండు సంస్థలు రాబోయే 3 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను విస్తరించాలనే లక్ష్యంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మొదటి ఏడాది రూ. 30 కోట్లు, రెండో సంవత్సరంలో రూ. 40 కోట్లు, మూడో ఏడాదిలో రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
జోమాటో, స్విగ్గి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఢిల్లీవేరీ, పోర్టర్ ఇంకా మరెన్నో లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీలకు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలరె సరఫరా చేయాలని BLive, CBPL సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. టైర్ II citys పై దృష్టి సారించి దేశవ్యాప్తంగా వాహనాలను విస్తరించడంలో సంస్థలకు సహాయం చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. mou between blive chartered bike
ఈ సందర్భంగా BLive సంస్థ CEO & సహ-వ్యవస్థాపకుడు సమర్థ్ ఖోల్కర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వలన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. తక్కువ నిర్వహణ ఖర్చులు, సాధారణ యంత్రాంగం తక్కువ నిర్వహణతో EVలు లాస్ట్-మైల్ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్లకు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు.
CBPL సహ వ్యవస్థాపకుడు పరమ్ మాండ్లోయి మాట్లాడుతూ “మా ఇ-కామర్స్, లాస్ట్ -మైల్ డెలివరీ సేవలు.. వేగవంతమైన, విశ్వసనీయమైన, పర్యావరణ అనుకూలమైన డెలివరీ సేవలు అందించాలనకునే వినియోగదారుల అవసరాలను తీరుస్తాయి. మా ఎలక్ట్రిక్ డెలివరీ వాహనాలు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడం ద్వారా వ్యాపారాలు తమ వినియోగదారుల అవసరాలను తీర్చడాన్ని సులభతరం చేస్తాయి. కాగా ప్రస్తుతం, CBPL 15 నగరాల్లో ప్రత్యేకించి టైర్ II నగరాల్లో విస్తరించి కలిగి ఉంది.