Harithamithra Telugu News

Home EV Updates మూడేళ్ల‌లో 10వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు

మూడేళ్ల‌లో 10వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు

0
mou between blive chartered bike

BLive, CBPL సంస్థ‌ల మ‌ద్య కీల‌క ఒప్పందం

mou-between-blive-chartered-bike : మ‌ల్టీ -బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్ అయిన BLive, పబ్లిక్ బైక్ షేరింగ్, క్యాంపస్‌లో మొబిలిటీ, ఇ-కామర్స్ డెలివరీ లాస్ట్ మైల్ డెలివరీ సేవలలో ప్రత్యేకత కలిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ అయిన చార్టర్డ్ బైక్ Chartered Bike (CBPL) తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది.
ఈ రెండు సంస్థ‌లు రాబోయే 3 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను విస్తరించాలనే లక్ష్యంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మొదటి ఏడాది రూ. 30 కోట్లు, రెండో సంవత్సరంలో రూ. 40 కోట్లు, మూడో ఏడాదిలో రూ.50 కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి.

జోమాటో, స్విగ్గి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఢిల్లీవేరీ, పోర్టర్ ఇంకా మరెన్నో లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీలకు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలరె సరఫరా చేయాల‌ని BLive, CBPL సంస్థ‌లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. టైర్ II citys పై దృష్టి సారించి దేశవ్యాప్తంగా వాహనాలను విస్త‌రించ‌డంలో సంస్థలకు సహాయం చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. mou between blive chartered bike

ఈ సంద‌ర్భంగా BLive సంస్థ CEO & సహ-వ్యవస్థాపకుడు సమర్థ్ ఖోల్కర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వలన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. తక్కువ నిర్వహణ ఖర్చులు, సాధారణ యంత్రాంగం తక్కువ నిర్వహణతో EVలు లాస్ట్-మైల్ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్లకు ఎంతో దోహ‌దం చేస్తాయ‌ని తెలిపారు.

CBPL సహ వ్యవస్థాపకుడు పరమ్ మాండ్లోయి మాట్లాడుతూ “మా ఇ-కామర్స్, లాస్ట్ -మైల్‌ డెలివరీ సేవలు.. వేగవంతమైన, విశ్వసనీయమైన, పర్యావరణ అనుకూలమైన డెలివరీ సేవ‌లు అందించాల‌న‌కునే వినియోగదారుల అవసరాలను తీరుస్తాయి. మా ఎలక్ట్రిక్ డెలివరీ వాహనాలు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడం ద్వారా వ్యాపారాలు తమ వినియోగదారుల అవసరాలను తీర్చడాన్ని సులభతరం చేస్తాయి. కాగా ప్రస్తుతం, CBPL 15 నగరాల్లో ప్రత్యేకించి టైర్ II నగరాల్లో విస్త‌రించి కలిగి ఉంది.


Tech news

Previous articleవ‌చ్చే ఏడాదిలో హోండా నుంచి మ‌రో రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు
Next articleరూ.1.10 లక్షలకే Odysse Vader e-motorcycle
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here