Gogoro electric scooter: తైవానీస్ టెక్నాలజీ సంస్థ గొగోరో (Gogoro) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ev market లోకి అడుగు పెట్టింది. క్రాస్‌ఓవర్ (Crossover)అని పేరు పెట్టబడిన ఈ స్కూటర్ మొదట్లో బి2బి సెగ్మెంట్‌ను ప్రత్యేకంగా లాస్ట్ మైల్ సర్వీసుల కోసం అందిస్తుంది. స్కూటర్‌ల SUVగా పేర్కొనబడిన గొగోరా ఆసక్తికరంగా ఇంకా క్రాస్‌ఓవర్ ధరలను ప్రకటించలేదు..
గొగోరో swapping stations
Gogoro Crossover launched : కొత్త ఇ-స్కూటర్‌తో పాటు, EV బ్రాండ్ దాని బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లను కూడా ఆవిష్కరించింది. వీటిని దశల వారీగా దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేస్తారు. మొదట ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ, గోవాలో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. 2024 ప్రథమార్థంలో ముంబై పూణేలకు లభ్యత మరింత విస్తరించబడుతుంది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని గొగోరో ఉత్పత్తి కేంద్రంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారైంది. ఈ scooter మూడు వెరియంట్ల లో అందుబాటులో ఉంది.
- క్రాస్‌ఓవర్ GX250
- క్రాస్‌ఓవర్ 50
- క్రాస్‌ఓవర్ S
గొగోరో మూడు డెరివేటివ్‌లలో అందుబాటులో ఉందని, క్రాస్‌ఓవర్ GX250 ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది.
మాడ్యులర్ స్టీల్ ‘ఆల్-టెర్రైన్’ ఫ్రేమ్ ఆధారంగా గోగోరో స్కూటర్ ను అభివృద్ధి చేశారు. ఇది లాస్ట్ మైల్. డెలివరీ కోసం ఉద్దేశించబడింది. దీనికి ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తూ, ఆండ్రాయిడ్-వంటి పేస్ , దీర్ఘచతురస్రాకార LED హెడ్‌ల్యాంప్ ఆప్రాన్ నుండి బయటకు వస్తుంది. క్రాస్ఓవర్ 2000 మి.మీ పొడవు ఉండే పొడవైన స్కూటర్లలో ఒకటి. ఇది స్ప్లిట్-సీట్ సెటప్‌తో వస్తుంది కానీ గోగోరో దీనిని సింగిల్ పీస్ సీటుగా ఉపయోగించుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది.
2024 చివరి నాటికి తాము B2C విభాగంలోకి ప్రవేశించాలని చూస్తున్నామని గోగోరో కంపెనీ పేర్కొంది. . B2B నెట్‌వర్క్ సహాయంతో దేశవ్యాప్తంగా తన స్వాపింగ్ స్టేషన్‌ల యొక్క విస్తృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం తమ తక్షణ కర్తవ్యం అని కంపెనీ వెల్లడించింది
electricGogoro electric scooter స్పెక్స్
CrossOver GX250 2.5 kW డైరెక్ట్ డ్రైవ్‌ను ఉపయోగించుకుంటుంది. ఇది 60+kph గరిష్ట వేగాన్ని, అలాగే ఒకే ఛార్జ్‌పై 111 కిమీల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. క్రాస్ఓవర్ 50 5kW మోటార్‌ను పొందుపరిచారు. అయితే టాప్-స్పెక్ క్రాస్ఓవర్ S ట్రిమ్ 6.4kW మరియు 7.2kW అనే రెండు ఎంపికలను కలిగి ఉంటుంది. -. సస్పెన్షన్ విషయానికొస్తే.. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి.. దీనికి 176 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.
Looking new.. and innovatic
👌👌👌
style super
nice scooter.. price..?