Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో లాంచ్ అయింది. ఈ కారు మనదేశంలో రూ. 65.90 లక్షల ధరకు అందుబాటులో ఉండనుంది. ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఒకే GT లైన్ వేరియంట్‌లో వస్తోంది. EV6 ఫేస్‌లిఫ్ట్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది డ్రైవర్ కారును అన్‌లాక్ చేసి స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది.
Kia EV6 లాంచ్:
ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 జనవరి 2025లో ఢిల్లీలో జరిగింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా, ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 సందర్భంగా అప్ డేట్ చేసిన ఫేస్‌లిఫ్టెడ్ కియా EV6ని ప్రదర్శించింది. ఈరోజు మార్చి 26, 2025న, కియా EV6 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో ప్రారంభించింది. ఈ కారు భారతదేశంలో రూ. 65.90 లక్షల ధరకు లాంచ్ చేసింది. ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఒకే GT లైన్ వేరియంట్‌లో వచ్చింది. కొత్త EV6 ఫేస్‌లిఫ్ట్‌లో మీకు ఏ ప్రత్యేక కొత్త ఫీచర్లు ఉన్నాయో ఇపుడు చూద్దాం.
Kia EV6 స్పెసిఫికేషన్స్
కొత్త కియా EV6 ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో పెద్ద 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే EV6 ఫేస్‌లిఫ్ట్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. దీని సహాయంతో డ్రైవర్ కారును అన్‌లాక్ చేసి స్టార్ట్ చేయవచ్చు. దీనితో పాటు, కారులో వెంటిలేటెడ్ సీట్లకు కంపెనీ కొత్త కంట్రోల్స్ ను కూడా అందించింది ఈ కంట్రోల్స్ కారు సెంట్రల్ కన్సోల్ దిగువన ఇవ్వబడ్డాయి. దీనితో పాటు, కొత్త కియా EV6 ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ లా కనిపిస్తుంది, దానిపై కియా లోగో కుడి వైపున ఇచ్చారు.
రేంజ్ , చార్జింగ్ టైం..
కొత్త కియా EV6 ఫేస్‌లిఫ్ట్ పెద్ద 84 kWh బ్యాటరీని కలిగి ఉంది. కొత్త EV6 ఫేస్‌లిఫ్ట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 663 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. 350kw ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఈ కారును కేవలం 18 నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. కొత్త EV6 ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ట్రాయాంగిల్ ఆకారపు హెడ్‌ల్యాంప్, హైబ్రో మాదిరిగా రూపొందించబడిన DRL ఉన్నాయి. ఈ కారులో 19 అంగుళాల చక్రాలు ఉన్నాయి, కారు ముందు గ్రిల్ కూడా కొత్త డిజైన్ తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
kia EV6 | స్పెసిఫికేషన్స్ |
---|---|
బ్యాటరీ కెపాసిటీ | 84 kWh |
రేంజ్ | 663 కిలోమీటర్లు |
చార్జింగ్ టైం (350kw ఫాస్ట్ ఛార్జర్) | 10% నుండి 80% వరకు 18 నిమిషాలు |
ఎక్స్ షోరూం ధర | రూ. 65.90 లక్షలు |
సామర్థ్యం | 605 Nm టార్క్ |
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..