Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

465 కి.మీ రేంజ్ తో Nexon EV 2023 లాంచ్..

Spread the love

 ధరలు రూ 14.74 లక్షల నుండి ప్రారంభం

Nexon EV 2023: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ దూసుకుపోతోంది తాజాగా టాటా నెక్సాన్ ఈవీ 2023ని గురువారం విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోడల్ ధర రూ. 14.74 లక్షలతో మొదలై రూ.19.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).

గతంతో పోలిస్తే స్టైలిష్ లుక్స్, లగ్జరీ ఇంటీరియర్స్, సన్ రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్ సిస్టం వంటి హైటెక్ ఫీచర్లతో కొత్త ఈవీ వచ్చింది. తాజాగా ఈ రోజు నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధరల్ని టాటా రివీల్ చేసింది. మీడియం, లాంగ్ రేంజ్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు(ఎక్స్-షోరూం) నుంచి రూ. 19.94 లక్షల(ఎక్స్-షోరూం) వరకు ఉంది. మొత్తం మూడు ట్రిమ్స్.. క్రియేటివ్, ఫియర్ లెస్, ఎంపవర్డ్ లలో లభ్యమవుతుంది. గతంలో వీటి స్థానంలో ప్రైమ్, మ్యాక్ ఉండేవి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కారుకి నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ పోటీనిస్తుంది.

వేరియంట్ వారీగా ధరలు

 నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ (మీడియం రేంజ్) ధరలు(ఎక్స్ షోరూం):

క్రియేటివ్+ – రూ. 14.74 లక్షలు

ఫియర్ లెస్ – రూ.16.19 లక్షలు

ఫియర్ లెస్+ – రూ. 16.69 లక్షలు

ఫియర్ లెస్+S – రూ. 17.19 లక్షలు

ఎంపవర్డ్ – రూ. 17.84 లక్షలు

నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ (లాంగ్ రేంజ్) ధరలు(ఎక్స్-షొరూం):

ఫియర్ లెస్ – రూ. 18.19 లక్షలు

ఫియర్ లెస్ + – రూ. 18.69 లక్షలు

ఫియర్ లెస్ + – ఎస్ – రూ. 19.19 లక్షలు

ఎంపవర్డ్+ – రూ. 19.94 లక్షలు

ఫీచర్స్

కొత్తగా ప్రారంభించిన నెక్సాన్ ఈవీ, Tata.ev బ్రాండ్ కు అనుగుణంగా Nexon.ev పేరుతో వస్తోంది. ఈ కొత్త ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో కారు ఎక్స్ టీరియర్స్ చాలా వరకు మార్చేశారు. చూడటానికి నెక్సాన్ ఫేస్ లిఫ్ట్, నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ సేమ్ టూ సేమ్ ఉన్నాయి. గతంతో పోలిస్తే కొత్త నెక్సాన్ ఈవీలో ఎయిరోడైనమిక్స్ మెరుగయ్యాయి. నెక్సాన్ ఈవీ సింగిల్ టోన్ బాడీ కలర్ గ్రిల్ తో వస్తోంది. ముందు భాగాన పూర్తిగా పొడవైన ఎల్ ఈడీ లైట్స్ తో మరింత ఆకర్షనీయంగా ఉంది. సీక్వెన్షియల్ LED DRL కలిగి ఉంది. అలాయ్ వీల్స్ డిజైన్ మారింది.

ఇక లోపల ఇంటీరియర్స్ విభాగాన్ని పరిశీలిస్తే 10.25 ఇన్ స్ట్రుమెంట్ డిస్ ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ని సపోర్ట్ చేస్తుంది. 360-డిగ్రీ యాంగిల్ కెమెరా, వైర్ లెస్ ఛార్జర్, వెంటిలెటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, టైప్-సి పోర్ట్ లు, సన్ రూఫ్, జేబీఎల్(JBL) ఆడియో, వాయిస్ కమాండ్‌ తోపాటు మరిన్ని ఫీచర్లు ఇందులో పొందుపరిచారు.

బ్యాటరీ, రేంజ్:

గతంలో నెక్సాన్ ఈవీలో ప్రైమ్, మ్యాక్స్ వేరియంట్ల స్థానాల్లో మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వెర్షన్లు మార్పు చెంది వస్తున్నాయి. మీడియం రేంజ్(MR) 30 KWh బ్యాటరీతో 325 కి.మీ రేంజ్ ఇస్తే, లాంగ్ రేంజ్(LR) 40.5KWh బ్యాటరీతో 465 కి.మీ రేంజ్ వస్తుంది. గతంలో ఉన్న నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికిల్ తో పోలిస్తే 12 కి.మీ రేంజ్ అదనంగా ఉంది.. ఇక మోటార్ కూడా గతంతో పోలిస్తే 20 కిలోలు తేలికగా ఉంటుంది. లాంగ్ రేంజ్ మోటార్ 144 బీహెచ్పీ 215 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తే, మీడియం రేంజ్ 129 బీహెచ్పీ సామర్థ్యంతో 215 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

 

ధర, ఛార్జింగ్ ఫీచర్లు

కొత్త నెక్సాన్ ఈవీ 7.2 KW ఏసీ చార్జర్ తో మీడియం రేంజ్ ఈవీని 10 నుంచి 100 శాతం ఛార్జింగ్ చేయడానికి 4.3 గంటల టైం పడుతుంది. అలాగే లాంగ్ రేంజ్ ఈవీకి ఆరు గంటల సమయం పడుతుంది. డీసీ చార్జర్ తో కేవలం 56నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ క్రియేటివ్, ఫియర్ లెస్, ఎంపవర్డ్ ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 15 లక్షల-21లక్షల(ఎక్స్ షోరూం) మధ్యలో ఉంది. ఇది నేరుగా మహీంద్రా XUV 400 కి పోటీనివ్వనుంది.

ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ మార్కెట్‌లో టాటా మోటార్స్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. (వాహన్ రిజిస్ట్రేషన్ ప్రకారం క్యూ1 ఎఫ్‌వై24లో 76%) ఇందులో ముఖ్యంగా నెక్సాన్ ఈవీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. తాజాగా కొత్త మోడల్ దాని ICE కారులోని అనేక డిజైన్ అంశాలను కలిగి ఉంటుంది.

 వారంటీ

అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి వారంటీ. మోటారు బ్యాటరీ ప్యాక్ 8-సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీ (ఏదైతే ముందైతే అది) వారంటీతో వస్తాయి. అయితే, వాహనం ప్రామాణికమైన 3 సంవత్సరాల లేదా 1,25,000 కి.మీ (ఏదైతే అంతకు ముందు) వారంటీని కలిగి ఉంది. EVలోని బ్యాటరీ ధర మొత్తం వాహన ధరలో దాదాపు 35% ఉంటుంది.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *