Home » Nexzu Ev Cycle ఎల‌క్ట్రిక్ సైకిల్ లో నాలుగు వేరియంట్లు ధ‌ర‌లు ఫీచ‌ర్లు ఇవిగో..

Nexzu Ev Cycle ఎల‌క్ట్రిక్ సైకిల్ లో నాలుగు వేరియంట్లు ధ‌ర‌లు ఫీచ‌ర్లు ఇవిగో..

Nexzu Ev Cycle
Spread the love

Nexzu Ev Cycle | ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇటు ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. నగరాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా ట్రాక్స్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ ట్రాక్ లపై ఎలక్ట్రిక్ సైకిళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెరుగుుతన్న డిమాండ్ కు అనుగుణంగా ప్రముఖ కంపెనీలు అధిక మన్నిక, రేంజ్ ఇచ్చే ఈవీలను పరిచయం చేస్తున్నాయి.  అయితే తాజాగా  ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ సంస్థ  Nexzu Mobility దాని బజిరంగా (Bazinga),  రోడ్‌లార్క్ (Roadlark ) రేంజ్  ఉత్పత్తుల కింద నాలుగు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ల  కొత్త  వేరియంట్‌లు 5.2 Ah నుంచి 14.2Ah వరకు రేంజ్ తో స్వాప్ చేయగల బ్యాటరీలతో వస్తాయి. ఇది ఎలక్ట్రిక్ సైకిల్ ప్రియులకు మరింత ఖర్చుతో కూడుకున్నది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

100కి.మీ రేంజ్ వరకు

5.2Ah, 8.7Ah,  14.5 Ah  విభిన్న బ్యాటరీ ప్యాక్‌లు వరుసగా 30kms, 45kms, 100kms  రేంజ్ ఇస్తాయి.   వీటిని ప్రజలు వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించవచ్చు. ఈ కొత్త బ్యాటరీ ఫీచర్‌లు ప్రజలు దానిని కొనుగోలు చేయడానికి మరింత సౌకర్యవంతంగా  ప్రభావవంతంగా ఉంటాయి.

Nexzu మొబిలిటీ బిజినెస్ హెడ్ చింతామణి సర్దేశాయ్ మాట్లాడుతూ, “ఆకర్షణీయమైన ధరలో స్వాప్ చేయగల బ్యాటరీల పరిచయంతో, EV సైకిల్ ప్రస్తుతం EV 2W పరిశ్రమలో అత్యంత లాభదాయకమైన ఆఫర్ గా నిలుస్తుంది. తక్కువ ధరలో లభించే ఈ సైకిళ్లు   వ్యక్తిగత,  వాణిజ్య ఉపయోగం కోసం తక్కువ-దూర ప్రయాణాలకు EV సైకిల్స్ అనువైన ఎంపిక అని తెలిపారు.  మా కొత్త ఉత్పత్తి పరిచయంతో, వినియోగదారులు ఇప్పుడు వారి అవసరాన్ని బట్టి సైకిల్  వేరియంట్‌ని ఎంచుకోవచ్చని చింతామణి సర్దేశాయ్ పేర్కొన్నారు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Nexzu Ev Cycle కొత్త వేరియంట్లు వాటి ధరలు  

ModelBattery CapacityPrice
Rompus Plus5.2 AhRs. 29,900
Bazinga5.2 Ah (న్యూ వేరియంట్)Rs. 32,950
8.7 Ah (న్యూ వేరియంట్)Rs. 35,950
14.5 AhRs. 39,950
Roadlark5.2 Ah (న్యూ వేరియంట్)Rs. 32,950
8.7 Ah (న్యూ వేరియంట్)Rs. 35,950
14.5 AhRs. 39,950

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *