Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు Nizamabad | పసుపు రైతులకు గుడ్ న్యూస్: తడిసినా సరే.. కోతలు లేకుండా కొనుగోలు చేయాలి!

Nizamabad | పసుపు రైతులకు గుడ్ న్యూస్: తడిసినా సరే.. కోతలు లేకుండా కొనుగోలు చేయాలి!

0
Nizamabad Turmeric Market news

Nizamabad Turmeric Market news | అకాల వర్షాలతో నష్టపోయిన పసుపు రైతులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుల్లో పసుపు కొనుగోళ్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తేమ పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు

వర్షాల కారణంగా తడిసిన పసుపును ఎలాంటి కోతలు లేకుండా, పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. “తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు. నిబంధనల పేరుతో రైతులను వేధించే మార్కెట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.

Nizamabad మార్కెట్‌లో భారీగా పసుపు రాక

నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపు పంట భారీగా వస్తోందని మంత్రి తెలిపారు.

  • ప్రస్తుతం యార్డులో 27,400 బస్తాల (4,500 కుప్పలు) పసుపు నిల్వ ఉంది.
  • మరో 500 కుప్పలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయి.
  • అకాల గాలులు, వర్షాల వల్ల సుమారు 70 నుండి 80 కుప్పలు తడిశాయని, దీనివల్ల 40 మంది రైతులకు నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు.

టార్పాలిన్ల పంపిణీకి సిద్ధం

పంటను వర్షాల నుండి రక్షించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. 1,500 టార్పాలిన్ల పంపిణీ కోసం ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిందని, రైతులకు ఇబ్బంది కలగకుండా వీటిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

మేలు రకం పసుపు పంటకు ప్రభుత్వం ఖరారు చేసిన ధరను సక్రమంగా చెల్లించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. అన్నదాతలకు చెల్లింపుల విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు.

Previous articleసీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ భారీ ప్లాంట్ ప్రారంభం! – Premier Energies Plant
Next articleWarangal Market : నేటి అగ్రి కమోడిటీ రేట్లు ఇవే.. రైతులకు కీలక గమనిక!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here