Poise Scooters
- పోయెస్ ఎన్ఎక్స్-120 (Poise NX-120)
- పోయెస్ గ్రేస్ (Poise Grace)
Poise Scooters ధరలు (ఎక్స్-షోరూమ్, కర్ణాటక)
Poise NX-120 – Rs. 1,24,000
Poise Grace – Rs. 1,04,000
ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా విక్రయించనుంది. వాటి ధరలు ఆయా రాష్ట్రాలలో అందించే సబ్సిడీలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
Poise Scooters డిజైన్
Poise NX-120 ఈ-స్కూటర్ డిజైన్‌ను పరిశీలిస్తే.. ఇది షార్ప్ బాడీ లైన్స్, యాంగిల్స్‌తో చాలా స్పోర్టీగా అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది యవతను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన ఈ-స్కూటర్‌లా కనిపిస్తుంది. Poise Grace ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం, దాని పేరుకు తగినట్లుగా కాంపాక్ట్ డిజైన్‌తో క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటుంది.
బ్యాటరీ వివరాలు
పోయెస్ ఎన్ఎక్స్-120, పోయెస్ గ్రేస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు డిటాచబుల్ బ్యాటరీలను కలిగి ఉంటాయి. వీటిని సాధారణ హోమ్ అవుట్‌లెట్‌లను ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ హోమ్ ఎలక్ట్రిక్ యాక్ససరీస్ మాదిరిగానే తగిన 220 వోల్ట్ పవర్ సాకెట్ సాయంతో అపార్ట్‌మెంట్‌లలో కూడా సులువుగా ఛార్జ్ చేయవచ్చు. బేస్‌మెంట్‌లో చార్జింగ్ సౌకర్యం లేని, అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.
Poise Scooters రేంజ్
పోయెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ ఒకేరకమైన బ్యాటరీ ప్యాక్‌తో విక్రయిస్తోంది. ఇందులో NMC (నికెల్, మాంగనీస్, కోబాల్ట్) ఆధారిత లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీలను ఉపయోగించింది. ఈ రెండింటిలో ఒకేరకమైన 2kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. రేంజ్ విషయానికి వస్తే Poise NX-120 సింగిల్ చార్జిపై గరిష్టంగా 110కి.మీ నుంచి 140 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇక గ్రేస్ స్కూటర్ కూడా ఇదే రేంజ్‌ను కలిగి ఉంటుంది. కాగా ఇవి రెండూ గరిష్టంగా గంటకు 55కి.మీ వేగంతో ప్రయాణించగలవు.
ఫీచర్లు
పోయెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఫీచర్లను పరిశీలిస్తే వీటిలో పూర్తి ఎల్ఈడీ లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్, డిస్క్ బ్రేకులు, ఫ్రంట్ అండ్ రియర్ కాంబి-బ్రేక్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, విశాలమైన లెగ్‌రూమ్ ఉన్నాయి. పోయెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఇద్దరు పెద్దవారు హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్లు ఐదు రంగులలో అందుబాటులో ఉంటాయి.
ఎన్ఎక్స్-120, గ్రేస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రత్యేకమైన అంశం ఏంటంటే కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లు, P2P ఛార్జింగ్ పార్టనర్‌లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ఎప్పుడైన, ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది.
ఇదిలా ఉండగా పోయెస్ స్కూటర్స్ సంస్థ గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లే ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై పనిచేస్తోంది. ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు పోయెస్ జుయింక్ (Poise Zuink). ప్రస్తుతానికి ఈ స్కూటర్ అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే మార్కెట్లో వచ్చే అవకాశముది. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఓలా ఎస్1, ఏథర్ 450ఎక్స్ వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. పోయెస్ స్కూటర్స్ ప్రస్తుతం బెంగుళూరులోని యశ్వంత్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది.