Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

గుడ్ న్యూస్.. Ola Electric S1సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలపై భారీ తగ్గింపు..

Spread the love

ఓలా ఎలక్ట్రిక్ తన S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోపై రూ. 25,000 వరకు ధర తగ్గింపులను (Ola Electric reduces prices ) ప్రకటించింది.  ఫిబ్రవరి 16 నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. సవరించిన ధర పరిమిత కాల ఆఫర్, ఈ నెలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది అని పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ధరల తగ్గింపు ఇలా..

Ola S1X+ ధర ఇప్పుడు ₹ 84,999,
Ola S1 ఎయిర్ ₹1,04,999,
Ola S1 Pro Gen 2 ధర ₹1,29,999 .

Ola Electric reduces prices : S1 Pro, S1 Air , ఓలా S1 X+ (3kWh) మోడల్‌లు మాత్రమే కొత్తగా తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటాయి.  డిసెంబర్ 2023 లో , EV తయారీదారు S1 X+ మోడల్‌కు రూ. 20,000 ధర తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం దాని ధరను రూ. 89,999కి తగ్గించింది. ఇప్పుడు ధర మరింత తగ్గించగా కేవలం రూ. 84,999 లకే అందుబాటులో ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి ప్రకటనలపై మాట్లాడుతూ..  “ ఇంటిగ్రేటెడ్ అంతర్గత సాంకేతికత, తయారీ సామర్థ్యాల పంచుకోవడం వల్ల  మేము ఖర్చులను పునర్నిర్మించగలిగాము. దీంతో వినియోగదారులకు ప్రయోజనాలను అందించాలని నిర్ణయించుకున్నాము. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న  ప్రముఖ పెట్రోల్ స్కూటర్‌లకు సమానమైన ధరను కలిగి ఉంది. కస్టమర్‌లు ఇప్పుడు ICE స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి ఎటువంటి కారణం ఉండదని మేము విశ్వసిస్తున్నాము. అని పేర్కొన్నారు.

అంతేకాకుండా, Ola Electric కంపెనీకి చెందిన  అన్ని స్కూటర్లపై 8-సంవత్సరాల/80,000 కిమీ వరకు బ్యాటరీ వారంటీని ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రవేశపెట్టింది. ICE వాహనాలతో పోలిస్తే EVల జీవితకాలాన్ని సమర్థవంతంగా రెట్టింపు చేసింది. ఏప్రిల్ 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం 414 సర్వీస్ సెంటర్లు ఉండగా  వాటిని సుమారు 600 కేంద్రాలకు  విస్తరించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని కంపెనీ పేర్కొంది.


Green Mobility, Solar Energy,  Organic Farming, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్ జీ వాహనాలకు సంబంధించిన  అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

1 Comment

  • 🔌🛵 Ola Electric స్కూటర్‌ల ధరలపై మొత్తం ₹25,000 కు తగ్గింపు! 💰 ఇది ఇల్లును ఇల్లాలని మార్చడానికి ముందు గడువు కడుపును తగ్గించే ప్రయత్నం. 🚀🔋 ఇది గ్రాహకులను ఇలాంటి స్థితిలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆకర్షించే యాప్ అయింది! 🛍️💡

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *