Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

Spread the love

Ola Electric S1 X | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ వ్యాప్తంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Xని డెలివరీ చేయడం ప్రారంభించింది. బడ్జెట్-ఫ్రెండ్లీగా  రూపొందించబడిన ఈ కొత్త ఆఫర్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది అవి 2 kW, 3 kW, 4 kW. ఈ మోడల్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా ₹ 69,999, ₹ 84,999,  ₹ 99,999, Ola ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను భారీగా తగ్గించింది.  ప్రస్తుతం  ఓలా S1 X భారతీయ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా నిలిచింది.

Ola Electric S1 X స్పెసిఫికేషన్స్..

Ola Electric S1 X లోని 2 kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఛార్జ్‌పై 91 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ కావడానికి  7.4 గంటలు పడుతుంది. 6 kW పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటారుతో ఈ స్కూటర్ కేవలం 4.1 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది ఎకో, నార్మల్ స్పోర్ట్స్. ఓలా స్కూటర్ గంటకు 85 kmph వేగంతో దూసుకుపోతుంది.

కాస్ట్ కట్టింగ్ కారణంగా టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు బదులుగా, S1 X 3.5-అంగుళాల LCD స్క్రీన్‌ను పొందుపరిచారు. 3 kWh వెర్షన్ 2 kWh వేరియంట్ వలె అదే ఛార్జింగ్ సమయం, రైడింగ్ మోడ్‌లు ఇతర ఫీచర్లను కలిగి ఉంది. కానీ మెరుగైన యాక్సిలరేషన్, వేగం,  రేంజ్  విషయానికొస్తే..  ఇది 3.3 సెకన్లలో 0 నుండి 40 kmph వరకు వేగాన్ని అందుకుంటుందిన. గరిష్ట వేగం 90 kmph. సింగిల్ చార్జిపై  151 కిమీ రేంజ్ ఇస్తుంది. 4 kWh వేరియంట్ అదే పనితీరు స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది కానీ అత్యధికంగా  190 కిమీల రేంజ్ కలిగి ఉంటుంది.

ఈ సందర్భంగా  Ola ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తన అభిప్రాయాలను X లో పోస్ట్ చేశారు.   “Ola S1 Xకి  అపూర్వ స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది. మా S1 X మా కస్టమర్‌లకు డబ్బుకు నిజమైన విలువను అందిస్తుంది అని తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. “S1 Xతో, మేము Electric Vehicles కొనుగోళ్లలో ప్రాథమిక అడ్డంకులలో ఒకటైన ముందస్తు ఖర్చులను తగ్గిస్తాయని తెలిపారు. మాస్-మార్కెట్ విభాగంలోకి మా స్కూటర్లు విస్తృత కస్టమర్ బేస్‌ను చేరుకోవడానికి వీలు కల్పిస్తాయని తెలిపారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..