ఓలా.. అదిరిపోలా..

Spread the love

క‌నీవినీ ఎరుగ‌ని ఫీచ‌ర్ల‌తో ola electric s1. s1 pro

ఈ స్కూట‌ర్‌లో పాట‌లువినొచ్చు.. కాల్స్ మాట్లాడొచ్చు..

Ola S1 Electric scooter
Ola S1 Electric scooter

ola electric s1. s1 pro.. ఎన్నో రోజుగా ఊరిస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. ఎట్ట‌కేల‌కు అట్ట‌హాసంగా లాంచ్ అయింది. స్టైలిష్ బాడీ.. అదిరిపోయే అత్యాదునిక స్మార్ట్ ఫీచ‌ర్లు క‌లిగిన ఈ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూశారు.

ఎట్టకేలకు భారతదేశం తన 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లు ola electric s1. s1 pro దేశంలో విడుదల చేసింది. ఇది ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Ola S1 Electric scooter మోడ‌ల్ ధ‌ర(గుజ‌రాత్‌లో) రూ .79,999. అలాగే S1 ప్రో ధ‌ర రూ.1,09,999. గుజ‌రాత్‌లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంది. మిగ‌తా రాష్ట్రాల్లో ఓలా ఎస్ 1 ధర రూ.99,999. అలాగే ఓలా S1 ప్రో ₹ 129,999 కి లభిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డిసెంబర్ 2021 లో డెలివరీ ప్రారంభమవుతుంది.

  • న్యూ ఢిల్లీ:
    ఎస్1: రూ. 85,099
    ఎస్1 ప్రో: రూ. 1.10 లక్షలు
  • గుజరాత్:
    ఎస్1: రూ. 79,999
    ఎస్1 ప్రో: రూ 1.09 లక్షలు
  • మహారాష్ట్ర:
    ఎస్1: రూ. 94,999
    ఎస్1 ప్రో: రూ. 1.24 లక్షలు
  • రాజస్థాన్
    ఎస్1: రూ. 89,968
    ఎస్1 ప్రో: రూ 1.19 లక్షలు

ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ ఫీచ‌ర్లు

ఇన్నాళ్లు ఈ ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు అధికారికంగా వెల్ల‌డికాలేదు. కానీ లాంచ్ ఈవెంట్‌తో ఈ స్కూట‌ర్‌లోని ఫీచ‌ర్ల‌పై పూర్తిగా స్ప‌ష్ట‌త వ‌చ్చింది. దీని ఫీచ‌ర్లు అంద‌రూ ఊహించిన‌ట్టే అదిరిపోయేలా ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ ఎస్‌1 టాప్ స్పీడ్ గంట‌కు 90కిలోమీట‌ర్లు. దీని రేంజ్ సింగిల్ చార్జిపై 121కిలోమీట‌ర్లు.
అలాగే ఓలా ఎల‌క్ట్రిక్ ఎస్‌1 ప్రో టాప్ స్పీడ్ 115కి.మి. ఇక ఇది సింగిల్ చార్జ్‌పై 181కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ola electric s1 pro కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిమీ స్పీడ్‌ను అందుకుంటుంది. ఈ స్కూటర్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయ‌ని కంపెనీ సీఈవో భ‌విష్ అగ‌ర్వాల్ లాంచ్ ఈవెంట్‌లో తెలిపారు. అవి నార్మల్, స్పోర్ట్ అలాగే హైపర్ మోడ్స్.

ola electric s1. s1 pro రెండింటికీ 750W పోర్టబుల్ ఛార్జర్ ఇస్తారు. ఓలా కంపెనీ ఇప్పటికే హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్ల ప్రకటించింది. మొదటి ఏడాది దేశ‌వ్యాప్తంగా 400 నగరాల్లో లక్ష ఛార్జింగ్ పాయింట్ల‌ను అందుబాటులోకి తేవాల‌ని కంపెనీ లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. తొలి విడ‌తలో 100 నగరాల్లో 5000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయ‌నున్నారు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మ‌రో చ‌క్క‌ని ఫీచ‌ర్ రివర్స్ మోడ్ కూడా ఉంది. ఇది పార్కింగ్ సమయంలో ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఇరుకైన ప్రదేశంలో సులభంగా బయటకు రావడానికి అనువుగా ఉంటుంది.

  • Cruise control
  • Keyless access
  • In-built speakers
  • Voice Control
  •  Personalised Moods on instrument cluster (themes)

ola electric dashboard

కాల్‌ ఆక్సెప్ట్ / రిజెక్ట్ ఆప్ష‌న్

ఏథర్ 450X ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మాదిరిగానే  ola electric s1. s1 pro లోనూ ఫోన్ కాల్స్‌ను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. ఇందులోని టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ సహాయంతో మ‌న‌కు వ‌చ్చే కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు. ఇందులో ఇన్‌బిల్ట్ స్పీక‌ర్ల‌ను వినియోగించ‌డం విశేషం.

ఎంచ‌క్కా పాట‌ల‌నుకూడా ఆస్వాదించ‌వ‌చ్చు. డెడికేటెడ్ ఓలా మొబైల్ యాప్ ఉంది. దీని సహాయంతో మీరు వాహన గణాంకాలను చూడవచ్చు. మీ వాహనం కోసం సర్వీస్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ట్రాక్ చేయవచ్చు ఇంకా ఎన్నో స్మార్ట్ ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.

అద్భుత‌మైన సెన్సార్‌..

Ola Electric scooter S1 Pro  లో ఒక చక్కని ఫీచర్ ఆక‌ట్టుకుంటోంది.  ఓలా స్కూటర్ మ‌నం వెళితే దానంత‌ట అదే అన్‌లాక్ చేసుకొని ఆన్ అవుతుంది. దూరంగా వెళితే ఆటోమెటిక్‌గా లాక్ చేసుకుటుంది. స్కూటర్‌కి దగ్గరగా వచ్చినప్పుడు “హాయ్ అని (యూజర్ పేరు)” అని ప‌ల‌క‌రిస్తుంది. అలాగే ఆ వ్యక్తి వెళ్లినప్పుడు “బై, (యూజర్ పేరు)” అని చెబుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఓలా ఎలక్ట్రిక్ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఈఫీచ‌ర్‌ను లాంచ్ ఈవెంట్ సంద‌ర్భంగా చూపించారు.

4జీ వైఫై, బ్లూటూత్ క‌నెక్టివిటీ

ola electric s1. s1 pro స్కూట‌ర్లో ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో 7 అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది.  ఇది స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌తో స్కూటర్‌ని కనెక్ట్ చేయ‌వ‌చ్చు.  ఈ మొబైల్ యాప్ ద్వారా స‌మీపంలోని ఛార్జింగ్ స్టేషన్ ఎక్క‌డుందో తెలుసుకోవ‌చ్చు. అలాగే ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవ‌చ్చు. ఇందులో కీలెస్ ఎంట్రీ ఫీచర్ కూడా ఉంది.

ఈ స్కూటర్ 4G, Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.  ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ 3 GB ర్యామ్‌తో వస్తుంది.  అలాగే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.  ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పరిమాణం 7 అంగుళాలు.  ఈ విభాగంలో ఇది అత్యంత ప్రకాశవంతమైన స్క్రీన్ అని ఓలా కంపెనీ పేర్కొంది.  అంటే ఇది మ‌ధ్యాహ్న స‌మ‌యంలోనూ డిస్ల్పే చ‌క్క‌గా క‌నిపిస్తుంది.

ola elecric launch

8.5కిలోవాట్స్ భారీ మోటార్‌

ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 kW మోటార్‌తో వస్తుంది, ఇది 3.92 kWh లిథియం అయాన్ బ్యాటరీకి ఇది కనెక్ట్ చేయబడుతుంది . ఈ రెండూ మిగ‌తా అన్ని ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల కంటే ఓలా ఎలక్ట్రిక్‌లోనే ఈ విభాగంలో అతిపెద్దవిగా పేర్కొనబడ్డాయి.

వేగంగా చార్జింగ్‌

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక గంట‌లో 0 నుంచి 100 శాతం వ‌ర‌కు ఛార్జ్ అవుతుందని ఓలా ఎల‌క్ట్రిక్ తెలిపింది. అలాగే ఇది 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 50 శాతం ఛార్జ్ తో 75 కిలోమీటర్ల వ‌ర‌కు స్వేచ్ఛ‌గా ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ సాధార‌ణ హోమ్ ఛార్జర్ ద్వారా 6 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవ‌చ్చు.

ola s1 bootspace

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా “మూడ్స్” తో వస్తుంది, ఇది స్కూటర్ డిస్‌ప్లేను మారుస్తుంది మరియు స్కూటర్ సౌండ్ చేసే విధానాన్ని కూడా మారుస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పది రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. జూలై 15న ola electric s1. s1 pro ఇ-స్కూటర్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ 24 గంటల్లోనే లక్ష బుకింగ్‌లను సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే..

 

  • Top Speed  115 kmph
  • Acceleration (0-40 Kmph) 3s
  • Acceleration (0-60 Kmph) 5s
  • Length 1859 mm
  • Width 712 mm
  • Height 1160 mm
  • Saddle Height 792 mm
  • Ground Clearance 738 mm
  • Wheelbase 1359 mm
  • Kerb Weight 74 kg
  • Underseat storage 36 L
  • Tyre Size
  • Front/Rear 110/70-12,
  • Tyre Type Tubeless
  • Wheel Size
  • Front / Rear 304.8 mm
  • Wheels Type Aluminium Alloy
  • Front/ Rear Brake Disc
  • Front Brake Diameter 220 mm
  • Rear Brake Diameter 180 mm

Engine and Transmission

  • Max Torque 58 Nm
  • Drive Type Belt Drive
  • Motor Type AC Brushless
  • Motor Power 8500W
  • Range 181 km/charge

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను రూ.499తో ప్రీ బుకింగ్ చేసుకోవ‌చ్చు. ఇత‌ర వివ‌రాల‌కోసం ఓలా కంపెనీ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.
https://olaelectric.com/ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..