
18వ విడత కింద 9.4 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు పంపిణీ
PM Kisan Scheme | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 18వ విడతను అక్టోబర్ 5, 2024న మహారాష్ట్రలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థికసాయం అందింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా 20,000 కోట్లు జమ అయ్యాయి.
దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు), 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్‌లతో సహా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో చేరారు. విడుదల రోజును PM-కిసాన్ ఉత్సవ్ దివస్‌గా జరుపుకుంటూ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
24 ఫిబ్రవరి 2019న ప్రారంభించబడిన PM-KISAN పథకం భూమి కలిగి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తుంది. PM-KISAN 18వ విడతను అక్టోబర్ 5న ప్రధాన మంత్రి విడుదల చేస్తారు. ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ. 3.45 లక్షల కోట్లు దాటుతుంది, దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది.గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శ్రేయస్సు కోసం ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనంగా చెప్పవచ్చు.
PM-KISAN పథకానికి అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?
పీఎం కిసాన్ పథకానికి మీరు అర్హులా లేదా అనే విషయాన్ని తనిఖీ చేయవచ్చు. వారు ఇప్పటికే పథకంలో నమోదు చేసుకున్నప్పటికీ కింది దశల ద్వారా తెలుసుకోవచ్చు.
- అధికారిక PM-KISAN వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- లబ్ధిదారుల జాబితా పేజీకి నావిగేట్ చేయండి .
మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను నమోదు చేయండి. - లబ్ధిదారుల జాబితాను వీక్షించడానికి, మీ పేరు నమోదు చేశారో లేదో తెలుసుకునేందుకు ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేయండి.
E KYC చేసుకోండి..
రైతులందరూ KYC చేసుకోవాలని భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కాని రైతులు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. మీరు మీ e-KYCని కూడా పూర్తి చేయకుంటే. మీ వాయిదా నిలిచిపోవచ్చు. అందువల్ల, వీలైనంత త్వరగా ఈ-కేవైసీ పూర్తి చేయండి.
e-KYCని ఈ విధంగా పూర్తి చేయండి
మీరు ఇంట్లో కూర్చొని కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లలో e-KYC ప్రక్రియను స్వయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ కు వెళ్లండి. అప్పుడు మీరు ‘Farmers Cornerస అనే ఆప్షన్ నుఎంచుకోవాలి. దీని తర్వాత మీరు ‘e-KYC అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేసి, ఆ తర్వాత ‘Get OTP’ పై క్లిక్ చేయండి. దీని తర్వాత, మీ ఆధార్ కార్డుకు లింక్ చేసి ఉన్న మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత, దానిని సబ్ మిట్ చేస్తే మీ e-KYC పూర్తవుతుంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..