
18 నెలల్లో 25,000 యూనిట్ల విక్రయం

Pure EV electric scooters : హైదరాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్ Pure EV నత ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ ప్రధాన మోడల్ ePluto 7G లాంచ్ అయినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఇండియాలో సుమారు 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఈఫ్లూటో 7జీ మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 60 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. EPluto7G మోడల్‌తో పాటు, ప్యూర్ EV ఈఫ్లూటో, ETrance+ మోడళ్లు ఆదరణ పొందాయి. ఇందులో 1.8 kWh పోర్టబుల్ బ్యాటరీ ఉండగా సుమారు 65 కిమీ రేంజిని అందిస్తుంది. అలాగే ప్యూర్ ఈవీ హై-స్పీడ్ లాంగ్-రేంజ్ మోడల్ ETrance నియో 5 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్నిఅందుకుంటుంది. ఇందులో 2,500 Wh బ్యాటరీ ఉండగా ఒక్కసారి ఛార్జ్ చేయడానికి 120 కి.మీ రేంజ్ ఇస్తుంది. ప్యూర్ ఈవీ సంవత్సరానికి విక్రయాలలో 600 శాతం వృద్ధిని నమోదు చేసింది. హై-స్పీడ్ వేరియంట్లు 80% విక్రయమవుతున్నాయి. అలాగే 100% అమ్మకాలు కన్స్యూమర్ రిటైల్ షోరూంల ద్వారా వస్తున్నాయని కంపెనీ చెబుతోంది.
Pure EV ప్రతి షోరూంలో వర్క్‌షాప్
ప్యూర్ EV లో ప్రస్తుతం 100 బ్రాండెడ్ డెడికేటెడ్ అవుట్లెట్లు ఉన్నాయి. ప్రతి షోరూంలో బ్యాటరీతో సహా మెకానికల్ వర్క్‌షాప్ అలాగే పవర్‌ట్రెయిన్ ట్రబుల్షూటింగ్ సెటప్‌తో ఒక సేవా కేంద్రాన్ని కలిగి ఉంది. కంపెనీ ప్రస్తుతం సంవత్సరానికి 70,000 ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సమీప భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీనితో పాటు ప్యూర్ EV కూడా రాబోయే సంవత్సరంలో దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తోంది. అదనంగా, ప్యూర్ EV కూడా తన కస్టమర్ల కోసం బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ తోపాటు అన్ని విడి భాగాలకు ఎక్స్టెండెడ్ వారెంటీ పాలసీని ఇటీవల ప్రారంభించింది.
ఐఐటి హైదరాబాద్ రీసెర్చ్ పార్క్ వద్ద అత్యంత సమర్థవంతమైన కంట్రోలర్లు, మోటార్లతో పాటు లిథియం బ్యాటరీ తయారీని అభివృద్ధి చేసినట్లు ప్యూర్ ఈవి చెబుతోంది. ప్యూర్ ఈవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా మాట్లాడుతూ, ఇటీవల సాధించిన సేల్స్ మైలురాయి కంపెనీ ప్రయాణంలో ఒక ముఖ్యమైనదని తెలిపారు. ఇది కంపెనీ ఉత్తమ బ్యాటరీ టెక్నాలజీతోపాటు ఒకదానిని అభివృద్ధి చేయడంలో నిర్విరామ దృష్టికి నిదర్శనం అని అన్నారు.
ప్యూర్ ఈవీ ఈఫ్లూటో 7జీ స్కూటర్లో 3 స్పీడ్ మోడ్లు ఉన్నాయి. ఫస్ట్ మోడ్‌లో 45 కిలోమీటర్ల వేగంతో, సెకెండ్ మోడ్‌లో 55 కి.మీ, థర్డ్ మోడ్‌లో 60 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. రోడ్డుపై ఎదురుగా వెళ్లే వాహనాలను ఓవర్టేక్ చేయడానికి థర్డ్ మోడ్ ఉపయోగపడుతుంది. 150 నుంచి 200కిలోల వరకు బరువును మోయగలుగుతుంది.
ఇందులో ఉపయోగించిన వాటర్‌ప్రూఫ్ BLDC మోటారు 2kW వరకు గరిష్ట శక్తిని అందిస్తుంది. మోటార్ నుంచి ఎలాంటి శబ్దం రాదు. మొత్తం స్కూటర్ బరువు 73 కిలోలు. 165 మిమీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడంతో స్పీడ్ బ్రేకర్ల వద్ద పెద్దగా ఇబ్బందులు తలెత్తవు.
Pure EV Showrooms Phone Numbers
- Warangal EVNXT- 8247013036
- KukatPally 7337466611
- Kamareddy 9951974033
- Habsiguda 6300654362
- Kammam 8500906749
- Kothapet 9392022866
Nice
Nice
🌱🌱
Nice scooter