RenewSys : తెలంగాణలో రూ.6000 కోట్లతో భారీ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్

RenewSys solar Unit in telangana
Spread the love

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమకు మహర్దశ వచ్చింది. సోలార్ మల్టిపుల్  ఫొటోవోల్టాయిక్  మాడ్యూల్స్,  పివి సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు  రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (RenewSys India ) సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు సోమవారం పరిశ్రమల శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ కంపెనీ రూ.6,000 కోట్ల మేర పెట్టుబడి పెడుతుందని  అంచనా.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఫ్యాబ్‌సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రెన్యూసిస్‌కు కర్ణాటక, మహారాష్ట్రల్లో తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ అతిపెద్ద యూనిట్ తెలంగాణలోనే  ఏర్పాటు చేసేందుకు కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు.  కంపెనీకి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని  తెలిపారు. ఈ యూనిట్‌ ఏర్పాటైన తర్వాత  రాష్ట్రం సోలార్ ప్యానల్ పరికరాలకు హబ్‌గా మారుతుందని  చెప్పారు. ఇంధనంపై ప్రభుత్వం త్వరలో ఒక విధానాన్ని రూపొందించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని వివరించారు.

RenewSys, సింగపూర్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. ఇది  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. దీనికి దేశంలో మూడు తయారీ ప్లాంట్లు .. హైదరాబాద్, బెంగళూరు  పాతాళగంగలో ఉన్నాయి.  హైదరాబాద్ ఫ్యాక్టరీ దాని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ. కాగా ఈ ఒప్పదం ఫలితంగా రాబోయే ఐదేళ్లలో 11,000 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించడంతోపాటు తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు దాదాపుగా రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ నిర్ణయించింది.

 దశలవారీగా పెట్టుబడులు

  • కంపెనీ సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV) మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేస్తుంది
  • FY 24లో రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక్కొక్కటి 1 GW యొక్క 2 కొత్త లైన్లు,
  • FY 25, 2లో రూ. 1,250 కోట్ల పెట్టుబడితో 1 GW సామర్థ్యంతో సోలార్ PV సెల్స్ యూనిట్.
  • FY 27 నాటికి 1 GWతో రూ. 550 కోట్లతో సోలార్ PV మాడ్యూల్స్ యూనిట్లు,
  • 26-27 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1,750 కోట్ల అంచనా వ్యయంతో 2 సోలార్ PV సెల్స్ యూనిట్లు
  • FY 28 నాటికి రూ. 1,700 కోట్ల పెట్టుబడితో రూ. 2,000 కోట్లతో అల్యూమినియం ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది.

Green Mobility, Solar Energy,  Organic Farming, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్ జీ వాహనాలకు సంబంధించిన  అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *