Home » నేలకొరిగిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోశారు

నేలకొరిగిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోశారు

Spread the love

కొత్తగూడెం: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు నేలకొరిగిన కొన్ని దశాబ్దాల నాటి రెండు చెట్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) తిరిగి నాటి వాటికి మళ్ళీ జీవం పోసింది.. కొత్తగూడెంలోని ఎస్‌సిసిఎల్‌ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న ఆరు దశాబ్దాల నాటి పెద్ద మర్రిచెట్టు ఈదురు గాలులు, వర్షం కారణంగా నేలకూలింది. దీంతో  కంపెనీ డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) ఎన్ బలరామ్, చెట్టును మరో చోటికి తరలించి నాటాలని సూచించడంతో  నిపుణులు, సిబ్బంది రంగంలోకి దిగారు., చెట్టును ఎర్త్‌మూవర్ సహాయంతో లోపలి వేర్లను అతి జాగ్రత్తగా పైకి లాగి భారీ క్రేన్ సహాయంతో ట్రక్కులోకి ఎక్కించారు. కొత్తగూడెం బంగ్లా ప్రాంతంలో చెట్టును తీసుకొచ్చి నాటారు.

అదేవిధంగా, స్థానిక ఇండోర్ షటిల్ కోర్టు పక్కనే ఉన్న 50 ఏళ్ల దిరిసేన (వృక్ష శాస్త్రంలో అల్బిజియా లెబ్బెక్) అని పిలువబడే మరో భారీ చెట్టు ఇటీవల కురిసిన వర్షాలకు నేలకొరిగింది. అయితే దీనిని తర్వాత షటిల్ కోర్టు వెనుక నాటారు.

గతంలో రామగుండం-1 ప్రాంతంలో కొత్త ఓపెన్ కాస్ట్ గని ప్రాంతంలో 25 ఏళ్ల నాటి పలు వృక్షాలను వేర్లు లేపి వేరే ప్రాంతాలకు తరలించారు. ఆ చెట్లు బతికాయని, ఆరోగ్యంగా ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ అనుకూల చర్యలకు పేరుగాంచిన SCCL చెట్లను నాటడం మరియు రక్షించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని బలరామ్ అన్నారు.

చెట్ల మార్పిడి కి కృషి చేసిన సిబ్బంది, అధికారులను అయన అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *