Saffron Cultivation | భారతదేశంలో కుంకుమపువ్వును ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం జమ్మూ కశ్మీర్. బంగారు-రంగు పుప్పొడిని కలిగి ఉంటుంది. జమ్మూ కశ్మీర్‌లో సంవత్సరానికి ఒకసారి కుంకుమపువ్వు పండిస్తారు. ఎంతో విలువైన ఈ కుంకుమ పువ్వు (Saffron) ను “ఎర్ర బంగారం” అని పిలుస్తారు.భారతదేశంలో కుంకుమపువ్వు ఉత్పత్తికి కేంద్రంగా కశ్మీర్ నిలుస్తోంది. ప్రపంచంలోనే కుంకుమపువ్వు ఉత్పత్తిలో కశ్మీర్ రెండో స్థానంలో నిలిచింది.
కానీ కాశ్మీర్ లోయకు దూరంగా మీ ఇంట్లో కూడా పుట్టగొడుగులను పెంచినట్లుగా కుంకుమ పువ్వును పెంచవచ్చని మీకు తెలుసా.. అవును కాస్త కష్టపడితే ఇది సాధ్యమే.. ఓ రిటైర్డ్ ఇంజినీర్ స్వయంగా ఇంట్లోనే కుంకుమ పువ్వును సాగుచేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. నోయిడాకు చెందిన రమేష్ గేరా తన ఇంట్లోని ఒక చిన్న గదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వు మొక్కలను చుస్తే మీరు ఆశ్చర్యపోతారు.
1980లో NIT కురుక్షేత్రలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత, రమేష్ గేరా.. మూడు దశాబ్దాలకు పైగా అనేక బహుళజాతి కంపెనీలలో పనిచేశారు. విధుల్లో భాగంగా ఆయన పలు దేశాల్లో పర్యటించాడు. 2002లో, రమేష్ గేరా పని నిమిత్తం దక్షిణ కొరియాకు వెళ్లారు. ఆరు నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఆయన హైడ్రోపోనిక్స్(Hydroponics), మైక్రోగ్రీన్స్ (Micro Greens), ఇండోర్ కుంకుమపువ్వు సాగు వంటి అధునాతన వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. ఈ తరహా కొత్త పద్ధతులు ఆయనను ఎంతగానో ఆకర్షించాయి.
భారత్ లో భారీగా డిమాండ్..
భారత్ లో పరిమిత లభ్యత కారణంగా భారతదేశం ఇరాన్ నుంచి 70 శాతం కుంకుమపువ్వును దిగుమతి చేసుకుంటుందని, దేశీయ డిమాండ్లలో కాశ్మీర్ కేవలం 30 శాతం మాత్రమే తీరుస్తుందని ఆయన తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా కుంకుమ పువ్వు (Saffron Cultivation)ను ఇంట్లోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ 65 ఏళ్ల ఇంజనీర్ పదవీ విరమణ తర్వాత కుంకుమ సాగు కోసం నడుం బిగించారు. 2017లో నోయిడాలోని సెక్టార్ 63లో 100 చదరపు అడుగుల గదిలో కుంకుమ పువ్వును పెంచడం ప్రారంభించారు. గదిలో కుంకుమను పండించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు గ్రీన్‌హౌస్‌ను నిర్మించేందుకు రూ.4 లక్షలు వెచ్చించారు. కాశ్మీర్ నుంచి కుంకుమపువ్వు విత్తనాలు కొనుగోలు కోసం అదనంగా రూ.2 లక్షలు వెచ్చించారు. వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు నెలకు దాదాపు రూ.4,500 ఖర్చయ్యే కరెంటు బిల్లులు, కూలీ ఖర్చులు ఏడాదికి రూ. 8,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని రమేష్ తెలిపారు.
రూ.లక్షల్తో ధర
saffron price : ‘‘మార్కెట్‌లో కుంకుమపువ్వుకు భారీగా డిమాండ్ ఉంటుంది. మీరు హోల్‌సేల్ మార్కెట్‌లలో కిలోకు రూ. 2.5 లక్షలు, రిటైల్ మార్కెట్‌లలో కిలోకు రూ. 3.5 లక్షల వరకు సంపాదించవచ్చని రమేష్ తెలిపారు. మీరు ఎగుమతి వ్యాపారంలోకి ప్రవేశించినట్లయితే మీరు కిలోకు రూ. 6 లక్షల వరకు సంపాదించవచ్చు, ”అని వివరించారు.
కుంకుమపువ్వు సాగుపై శిక్షణ
కుకుకుమ పువ్వు అమ్మకాలతో లాభాలు గడించిన తర్వాత రమేష్ వెనుకడుగు వేయలేదు.. ఇండోర్ కుంకుమ సాగులో ఇతరులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన నోయిడాలో ‘ఆకర్షక్ సాఫ్రాన్ ఇన్ స్టిట్యూట్ ను నిర్వహిస్తున్నారు. అక్కడ అతను ఇప్పటి వరకు 370 మంది ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చారు. రెండు రోజుల ఆన్‌లైన్ శిక్షణా కోర్సులను కూడా ప్రారంభించారు. ఆసక్తిగల వారికి ఒక సంవత్సరం పాటు గైడెన్స్, మెంటర్‌షిప్‌ను అందిస్తున్నారు. ఈ ప్రయత్నం అతనికి రూ. 3.5 లక్షలకుపైగా నెలవారీ ఆదాయాన్ని అందిస్తోంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.
Wow.. Great successful story..
Nice
[…] Saffron Cultivation : ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు.. … […]