Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..

Spread the love
  • సింగిల్ చార్జిప్ 212కి.మి రేంజ్
  • ఎక్స్ షోరూం ధర రూ.1.45 నుంచి ప్రారంభం.
  • అధికారికంగా ప్రకటించిన సింపుల్ ఎనర్జీ 

బెంగళూరుకు చెందిన EV స్టార్ట్-అప్.. సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్  Simple One Electric Scooter ను విడుదల చేసింది. కొత్త సింపుల్ వన్ ఇ-స్కూటర్ భారతదేశంలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధరతో వస్తోంది. దీని కోసం బుకింగ్‌లు  2021 ఆగస్టు నుంచే ప్రారంభమయ్యాయి. ఇక ఈ వాహనాల డెలివరీలు జూన్ 6, 2023 నుంచి మొదలవుతాయి.

Simple One EV ధర ఎంత?

సింపుల్ వన్ మోనో-టోన్ ధర రూ. 1.45 లక్షలు, డ్యూయల్-టోన్ కలర్ వేరియంట్ల ధర రూ. 1.50 లక్షలుగా నిర్ణయించారు. 2021లోనే బుకింగ్‌లు తెరిచి ఉండగా  ఇప్పటివరకు  1 లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఈ ఇ-స్కూటర్ డెలివరీలు వచ్చే నెలలో బెంగళూరు నుంచొ దశల వారీగా ప్రారంభం కానున్నాయి. సింపుల్ ఎనర్జీ రాబోయే 10 నెలల్లో భారతదేశం అంతటా దాదాపు 150 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Simple One  Electric Scooter

సింపుల్ వన్ EV: బ్యాటరీ, రేంజ్

కొత్త సింపుల్ వన్  ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పోర్టబుల్ 5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ (ఫిక్స్‌డ్ – రిమూవబుల్) అమర్చబడింది. ఇది ఒక్కో ఛార్జ్‌కి 212 కిమీల రేంజ్ ఇస్తుందని కంపెనీ  పేర్కొంది. ఇది 72 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేసే 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో  వస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 105 kmph వేగాన్ని కలిగి ఉంది. దీనిని హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి 6 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే ఈ సింపుల్ ఎనర్జీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్, ఓలా ఎస్ 1 ప్రో వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది.

కంపెనీ ఏం చెబుతోంది?

Simple One  Electric Scooter లాంచ్ గురించి సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “పోటీతో కూడిన భారతీయ ఆటో ల్యాండ్‌స్కేప్‌లో మా ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము మరియు మేము పరిశ్రమ నుండి సేకరించే అంతర్దృష్టులు మరియు నేర్చుకోవడం ద్వారా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడంపై నిరంతరం దృష్టి పెడతాము. ముందుకు వెళుతున్నప్పుడు, తమ సింపుల్ వన్ హోమ్‌ని పొందడానికి ఓపికగా ఎదురుచూస్తున్న కస్టమర్‌ల కోసం త్వరిత డెలివరీలను సులభతరం చేయడం మా అతిపెద్ద ప్రాధాన్యత.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం  హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *