Harithamithra Telugu News

Home EV Updates మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు! ‘విజన్ ఇ-స్కై’ కాన్సెప్ట్ ఆధారంగా కొత్త ఈవీని పరీక్షిస్తున్న...

మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు! ‘విజన్ ఇ-స్కై’ కాన్సెప్ట్ ఆధారంగా కొత్త ఈవీని పరీక్షిస్తున్న సుజుకి!

0
Entry level EV)
  • ‘విజన్ ఇ-స్కై’ కాన్సెప్ట్ ఆధారంగా డిజైన్..
  • మారుతి ఎస్-ప్రెస్సో కంటే ఎత్తైన కొలతలతో ఆవిష్కరణ!
  • సింగిల్ ఛార్జ్‌పై 270 కిలోమీటర్ల మైలేజ్.. బడ్జెట్ ధరలోనే లభించే అవకాశం!

గత సంవత్సరం జరిగిన జపాన్ మొబిలిటీ షోలో సుజుకి ఆవిష్కరించిన ‘విజన్ ఇ-స్కై’ (Vision e-Sque) కాన్సెప్ట్ ఆధారంగా తన రాబోయే సరికొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని (Entry level EV) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ముందే పరీక్షిస్తోంది. మోటార్.ఈఎస్ (Motor.ES) పంచుకున్న తాజా స్పై షాట్‌ల ప్రకారం, ఈ కారు రోడ్లపై టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త మోడల్‌ను మొదట యూరప్ మార్కెట్‌లో విడుదల చేయాలని యోచిస్తున్నప్పటికీ, తదుపరి దశలో భారత్​ వంటి పలు గ్లోబల్ మార్కెట్లలో కూడా ప్రవేశపెట్టేందుకు సుజుకి కసరత్తు చేస్తోంది.

డిజైన్.. కాంపాక్ట్ కొలతలు

స్పై షాట్‌ల ఆధారంగా ఈ ప్రొడక్షన్ మోడల్ చాలా వరకు ఒరిజినల్ విజన్ ఇ-స్కై కాన్సెప్ట్ డిజైన్‌తో రూపొందించినట్లు స్పష్టమవుతోంది. అయితే, దీనిని ప్రొడక్షన్ వేదికకు సిద్ధం చేయడానికి బంపర్లు, ఫ్రంట్ ఫేసియా, గ్రిల్, లైటింగ్‌తో సహా కొన్ని బయటి భాగాల్లో స్వల్ప మార్పులు చేశారు.

పొడవు, వెడల్పులు: జపాన్ దేశపు కీ కార్ (Kei Car) నిబంధనల పరిధిలో అభివృద్ధి చేసిన ఈ మోడల్ పొడవు 3,395 మిమీ, వెడల్పు 1,475 మిమీ, ఎత్తు 1,625 మిమీగా ఉంది.

ఎస్-ప్రెస్సో కంటే పెద్దది: ఈ వాహనం భారతదేశంలో విక్రయించబడుతున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (S-Presso) కంటే కొద్దిగా ఎత్తుగా ఉంటుంది.

ఇంటీరియర్ స్పేస్: దీని నిటారుగా ఉండే బాక్సీ ఆకృతి, చిన్న ఓవర్‌హ్యాంగ్‌లు లోపలి భాగంలో గరిష్ఠ స్థలాన్ని (Interior Space) కల్పిస్తాయి.

కర్వ్​డ్​ హెడ్‌ల్యాంప్‌లు, నిలువుగా అమర్చిన LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు అలాగే ఉంచినప్పటికీ, కాన్సెప్ట్‌లో చూపించిన ఫుల్-విడ్త్ లైట్ బార్ ఉత్పత్తి వెర్షన్‌లో ఉండే అవకాశం లేదు. అయితే యువతరాన్ని ఆకర్షించేందుకు సుజుకి ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌ను కస్టమైజ్ చేసుకునే వీలు కల్పించనుంది.

ఆలస్యంగా మార్కెట్లోకి ఎంట్రీ:

సుజుకి ఈ కార్ విడుదలను ఆర్థిక సంవత్సరం 2026 లోనే చేయనున్నట్లు గతంలో ధృవీకరించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం దీని లాంచ్ కాలపరిమితి కొంత వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Entry level EV : బ్యాటరీ, Range

ఈ ఎంట్రీ లెవల్ ఈవీ అత్యంత సమర్థవంతమైన ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. బ్యాటరీ ప్యాక్: 20-25 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 270 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. (ఇది గతంలో ప్రదర్శించిన మునుపటి కాన్సెప్ట్ eWX మైలేజ్ 230 కి.మీల కంటే మెరుగైనది).

భారత మార్కెట్లో మారుతి వ్యూహాలు

భారత మార్కెట్‌కు అనుగుణంగా మారుతి సుజుకి ఈ మోడల్‌ను స్థానికీకరించి ప్రవేశపెడుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే, కంపెనీ ఈ ఏడాది చివర్లో ఇ-విటారా (e-Vitara) తర్వాత మూడు వరుసల సీట్లు గల ఎలక్ట్రిక్ ఎంపీవీ (MPV)ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Previous articleE20 | దేశవ్యాప్తంగా మూడు రకాల పెట్రోల్ గ్రేడ్‌ల సరఫరా లేదు: కేంద్ర ప్రభుత్వం స్పష్టత!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here