Svitch Electric Bike | సింగిల్ చార్జిపై 190కి.మీ రేంజ్.. మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ CSR 762..

Spread the love

Svitch Electric Bike : గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ Svitch  తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) ను విడుదల చేసింది.  CSR 762 పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ఎక్స్ షోరూం ధర రూ. 1.90 లక్షలుగా ఉంది.  రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు 2022లో ఈ మోటార్‌సైకిల్‌ను ఆటో ఎక్స్ పోలో  మొదటిసారి ప్రదర్శించారు.

అయితే మిగతా  ఎలక్ట్రిక్ బైక్ లో మాదిరిగా కాకుండా దీని డమ్మీ ఫ్యూయల్ ట్యాంక్ లోపల హెల్మెట్ కోసం 40 లీటర్ ఖాళీ స్థలం ఉంటుంది. స్కార్లెట్ రెడ్, బ్లాక్ డైమండ్, మోల్టెన్ మెర్క్యురీ అనే మూడు రంగుల్లో ఈ బైక్  అందుబాటులో ఉంటుంది.  తాజా లాంచ్‌పై స్విచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ MD, వ్యవస్థాపకుడు రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ.. “CSR 762 ని ఆవిష్కరించడం గర్వంగా ఉంది. ఇది రైడర్లకు చక్కని అనుభూతినిస్తుందని తెలిపారు. . సరసమైన ధర ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకురావడానికి, అత్యాధునిక టెక్ ఫీచర్లతో రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి తమ బ్రాండ్ కట్టుబడి ఉందని తెలిపారు. ఎలక్ట్రిక్ బైక్ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Svitch Electric Bike

CSR 762 స్పెక్స్ & ఫీచర్లు

CSR 762 లో 3kW మిడ్-డ్రైవ్ PMS DC ఎలక్ట్రిక్ మోటార్ ను వినియోగించారు.  ఇది 10kW (13.4 bhp), 56 Nm గరిష్ట అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇది 3.6kWh సామర్థ్యం గల ట్విన్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. సింగిల్ చార్జిపై  190km (IDC) కి.మీ వరకు రేంజ్ ని అందిస్తుంది. పనితీరు విషయానికొస్తే, బైక్ 120 kmph టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది. మోటార్, ఇతర ముఖ్యమైన భాగాల కోసం ఎయిర్ కూలింగ్ టెక్‌తో ఇ-బైక్ కూల్‌గా ఉంటుంది కాబట్టి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ల అవసరం లేదు.

పటిష్టమైన  స్టీల్ స్కెలిటన్ ఫ్రేమ్‌పై ఈ బైక్ నిర్మించబడింది. CSR 762లో సస్పెన్షన్ డ్యూటీస్ విషయానికొస్తే టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్. వెనుక వైపున మోనో-షాక్స్ ఉంటాయి. కాంబి బ్రేకింగ్ సెటప్ సహాయంతో 300mm ఫ్రంట్, 280mm వెనుక డిస్క్‌ల ద్వారా బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది. బైక్ 110/80 ముందు, 140/70 వెనుక టైర్‌లతో 17-అంగుళాల రిమ్స్ ను ఉపయోగించారు.  దీని బరువు 155 కిలోలు ఉంటుంది.

SPECIFICATIONS 

FeaturesSpecifications
మోటార్ టైప్3kW Mid-Drive PMS DC Electric Motor
పీక్ ఔట్ పుట్10kW (13.4 bhp) and 56 Nm
బ్యాటరీ ప్యాక్Twin Lithium-ion, 3.6kWh capacity
పీక్ రేంజ్190 km (IDC)
టాప్ స్పీడ్120 km/h
కూలింగ్ సిస్టంAir Cooling Technology
రైడింగ్ మోడ్స్6

హైదరాబాద్ లో ప్రత్యేక షోరూం..

అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 6 రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఫీచర్ల పరంగా, CSR 762 ఇన్ బిల్ట్ మొబైల్ ఛార్జర్, కవర్ మొబైల్ హోల్డర్, iOS, Android స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సూట్‌తో వస్తుంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో నాలుగు ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు స్విచ్ పేర్కొంది. వినియోగదారుల కోసం బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ  నెట్‌వర్క్ ను కూడా ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

కొనుగోలుదారులు ఇప్పుడు రూ.1 నామమాత్రపు చెల్లింపు ద్వారా CSR762ని పొందేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేయవచ్చు. 100,000 EOIలను చేరుకున్న తర్వాత, స్విచ్ గ్రూప్ ఆ కీలక ప్రాంతాలలో అవుట్‌లెట్‌లను స్థాపించాలని యోచిస్తోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు  CSR762 వెబ్‌సైట్‌లో EOI ఫారమ్‌ను పూరించవచ్చు. మార్చి 31 గడువులోపు సమర్పించవచ్చు.  Svitch గ్రూప్ బైకింగ్ ఔత్సాహికులందరినీ విద్యుత్ విప్లవం (electric revolution) లో భాగం కావాలని ఆహ్వానిస్తోంది. కంపెనీ అధికారిక CSR762 వెబ్‌సైట్‌ లో  www.csr762.com/eoi వెబ్ పేజీని సందర్శించవచ్చు. 


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..