ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన ఎంట్రీ వేరియంట్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త ధరలను ప్రకటించింది. ఈ స్కూటర్ ను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి భారీగా ధరను తగ్గించేసింది. ప్రస్తుతం ఏథర్ 450S స్కూటర్ (Ather 450S price) ను బెంగళూరులో రూ. 1,09,000 ప్రారంభ ధరతో అలాగే ఢిల్లీలో రూ. 97,500 ధరకు అందిస్తోంది.
ఏథర్ 450S ఎలక్ట్రిక్ సూటర్ సవరించిన ధరల గురించి వ్యాఖ్యానిస్తూ, ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్ నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై పెరుగుతున్న డిమాండ్ ను పరిష్కరించడానికి ఏథర్ దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ డిమాండ్ ను తీర్చడానికి, మేము ఈ త్రైమాసికంలో దాదాపు 100 రిటైల్ టచ్ పాయింట్ లను ప్రారంభించామని చెప్పారు. మొత్తం టచ్ పాయింట్ లను 350 వరకు తీసుకొచ్చామని తెలిపారు. దీంతో పాటు, తాము ఎంట్రీ-లెవల్ స్కూటర్ అయిన ఏథర్ 450Sని చాలా తక్కువ ధరతో విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
తక్కువ ధరలో హై ఎంట్ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే కొనుగోలుదారులను ఈ ఆఫర్ ఆకర్షిస్తుంది.
Ather 450S Electric Scooter స్పెసిఫికేషన్స్..
Ather 450S price and Specifications : ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. దీనిసాయంతో ఈ స్కూటర్ సింగిల్ చార్జిపై 115km IDC రేంజ్ ను అందిస్తుంది. అలాగే ఇది 3.9 సెకన్లలో 0 నుండి 40kmph వరకు వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ గంటకు 90kmph టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి, Ather ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లను ఇందులో తగ్గించారు. 450Xలో కనిపించే టచ్ స్క్రీన్ TFTకి బదులుగా Ather 450S వేరియంట్ లో LCD డిస్ ప్లేను అమర్చారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..