Svitch Electric Bike | సింగిల్ చార్జిపై 190కి.మీ రేంజ్.. మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ CSR 762..
Svitch Electric Bike : గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ Svitch తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) ను విడుదల చేసింది. CSR 762 పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎక్స్ షోరూం ధర రూ. 1.90 లక్షలుగా ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు 2022లో ఈ మోటార్‌సైకిల్‌ను ఆటో ఎక్స్ పోలో మొదటిసారి ప్రదర్శించారు.అయితే మిగతా ఎలక్ట్రిక్ బైక్ లో మాదిరిగా కాకుండా దీని డమ్మీ ఫ్యూయల్ ట్యాంక్ లోపల హెల్మెట్ కోసం 40 లీటర్ ఖాళీ స్థలం ఉంటుంది. స్కార్లెట్ రెడ్, బ్లాక్ డైమండ్, మోల్టెన్ మెర్క్యురీ అనే మూడు రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. తాజా లాంచ్‌పై స్విచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ MD, వ్యవస్థాపకుడు రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ.. “CSR 762 ని ఆవిష్కరించడం గర్వంగా ఉంది. ఇది రైడర్లకు చక్కని అనుభూతినిస్తుందని తెలిపారు. . సరసమైన ధర ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకురావడానికి, అత్యాధునిక...