New Bajaj Chetak vs Ola S1 | బజాజ్ ఆటో ఇటీవలే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. సరికొత్త ఫీచర్లతో చేతక్ అర్బేన్, ప్రీమియం వేరియంట్‌లను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరలు ధర రూ.1.15 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.. అప్ డేట్ అయిన బజాన్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లు Ather 450, Ola S1, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.
అయితే బజాజ్, ఓలా రెండూ కూడా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన EV బ్రాండ్‌లు. స్పెసిఫికేషన్ల పరంగా Ola S1 ఎయిర్. S1 ప్రో మోడళ్లలో ఉన్న పోలికలు తేడాల పరిశీలిద్దాం. వాటిని బట్టి ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
బజాజ్ కొత్త వేరియంట్లు ఎలా ఉన్నాయి..?
బజాజ్ చేతక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది అందులో ఒకటి అర్బేన్, రెండోది ప్రీమియం. ఈ రెండు స్కూటర్లు ఆల్-మెటల్ బాడీలో నిర్మితమై క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. మెటల్ బాడీకిక కలిగి ఉండడం ఈవీ మార్కెట్ లో బజాజ్ స్కూటర్ల ప్రత్యేకత అని గమనించాలి.
ఇక బ్యాటరీ ప్యాక్, ఫీచర్లు, ఇతర మెకానికల్ అంశాల పరంగా అవి విభిన్నంగా ఉంటాయి. చేతక్ అర్బేన్, ఎంట్రీ-లెవల్ మోడల్. ఇందులో కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను చూడొచ్చు. అర్బేన్ వేరియంట్ 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండగా చేతక్ ప్రీమియం పెద్దదైన 3.2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది సింగిల్ చార్జిపై 127km రేంజ్ ఇస్తుంది. గంటకు 73kmph టాప్ స్పీడ్ తో ప్రయాణిస్తుంది.
ప్రీమియంలో నావిగేషన్ కోసం ఫోన్ కనెక్టివిటీ ఎంపికలతో పాటు హిల్ హోల్డ్ అసిస్ట్చ ఇతర ఫీచర్లతో కూడిన అప్‌డేట్ చేయబడిన TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. రెండు వేరియంట్లు Chetak Urbane, Premium స్టాండర్డ్ మరియు TecPac ఆప్షన్లల అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్, కనెక్టివిటీ పరంగా హైటెక్ ఫీచర్లను కలిగి ఉంటాయి.
ఓలా ఎస్ 1 వేరియంట్లు
Ola S1 మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. S1X, S1 ఎయిర్ మరియు S1 ప్రో. అయితే, S1 ఎయిర్, ఎస్1 ప్రో వేరియంట్లు చేతక్‌తో నేరుగా పోటీపడతాయి. S1 శ్రేణి సంప్రదాయ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తో నవీకరించబడిన ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమైంది. Ola S1 ఎయిర్ 3kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది. దీని సర్టిఫైడ్ రేంజ్ 151కిమీ.
S1 ఎయిర్ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. S1 ప్రో అనేది రేంజ్-టాపింగ్ వేరియంట్. బయటి నుంచి ఇది S1 ఎయిర్‌తో సమానంగా కనిపిస్తుంది. ఓలా ఎస్1 ప్రో 4kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది మరింత రేంజ్, వేగవంతమైన యాక్సిలరేషన్, టాప్ స్పీడ్ ను అందిస్తుంది. S1 ప్రో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డాష్ బోర్డ్, ఫోన్ కనెక్టివిటీ, తోపాటు అదనంగా ‘హైపర్’ రైడ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది.
New Bajaj Chetak vs Ola S1 స్పెసిఫికేషన్స్
పేపర్ పరంగా Ola S1 బజాన్ కంటే టాప్ స్పీడ్ తో వెళ్తుంది. అలాగే సింగిల్ చార్జిపై ఎక్కువ రేంజ్ ఇస్తుంది. అత్యాధునిక ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. అయితే, ఆఫ్టర్ సేల్స్ ఓలా సర్వీస్ సరిగ్గా ఉండదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. బజాజ్ స్కూటర్ మెటల్ బాడీతో బిల్ట్ క్వాలిటీ బాగుంటుందని టాక్.. వినియోగదారులు రెండు షోరూంలకు వెళ్లి టెస్ట్ రైడ్ చేసి స్వయంగా పరిశీలించుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటే మంచింది.
[table id=18 /]
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
My choice is bajaj 👌🏻