
MAO Suspension | పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిపై వేటు.. ఏసీబీ తనిఖీలే కారణమా?
Peddapalli MAO Suspension : జిల్లాలోని మండల వ్యవసాయ శాఖలో కలకలం రేగింది. విధుల్లో నిర్లక్ష్యం, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి (MAO) కె.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు.ఏసీబీ తనిఖీలే కారణమా?ఫిబ్రవరి 24వ తేదీన మండల వ్యవసాయ శాఖ కార్యాలయంపై ఏసీబీ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలు, కార్యాలయంలోని రికార్డుల నిర్వహణలో లోపాల ఆధారంగానే ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ విచారణ పూర్తిగా ముగిసే వరకు ఆమె సస్పెన్షన్ (MAO Suspension ) అమలులో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.అధికారుల మధ్య ఆధిపత్య పోరు?గత కొంతకాలంగా పెద్దపల్లి వ్యవసాయ శాఖలో అధికారుల మధ్య సమన్వయం లోపించిందని, ఆధిపత్య పోరు నడుస్తోందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారుల మధ్య నెలకొన్న అంతర్గత ...

