Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..
Bajaj CNG Bikes | ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్.. సీఎన్జీ బైక్ నిలవనుంది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన రవాణాను ప్రోత్సహించేందుకు బజాజ్ ఆటో కృషి చేస్తోంది. ఈ మేరకు Bajaj Auto FY25 నాటికి CNG-ఆధారిత మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తోందని. ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భారత్ మొబిలిటీ షో 2024 లో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.పూణేకు చెందిన OEM ప్రముఖ త్రీ-వీలర్ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శర్మ మాట్లాడుతూ, "మేము మూడు చక్రాల వాహనాలలో CNG సాంకేతికతను నిరూపించాం. మేము డ్యూయల్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌పై పని చేస్తున్నాం. ఇది 2025లో మార్కెట్లోకి రానుంది. ఇది ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌ను మారుస్తుంది. CNG మోటార్‌సైకిళ్లు పర్యావరణ అనుకూలమైనవి. అని తెలిపారు.బజాజ్ ఆటో పల్సర్, ఇతర బ్రాండ్ల మోటార్ సైకిళ్లను 90 కంటే ఎక్కు...