Bajaj CNG Bikes | ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్.. సీఎన్జీ బైక్ నిలవనుంది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన రవాణాను ప్రోత్సహించేందుకు బజాజ్ ఆటో కృషి చేస్తోంది. ఈ మేరకు Bajaj Auto FY25 నాటికి CNG-ఆధారిత మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తోందని. ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భారత్ మొబిలిటీ షో 2024 లో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పూణేకు చెందిన OEM ప్రముఖ త్రీ-వీలర్ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శర్మ మాట్లాడుతూ, “మేము మూడు చక్రాల వాహనాలలో CNG సాంకేతికతను నిరూపించాం. మేము డ్యూయల్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌పై పని చేస్తున్నాం. ఇది 2025లో మార్కెట్లోకి రానుంది. ఇది ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌ను మారుస్తుంది. CNG మోటార్‌సైకిళ్లు పర్యావరణ అనుకూలమైనవి. అని తెలిపారు.
బజాజ్ ఆటో పల్సర్, ఇతర బ్రాండ్ల మోటార్ సైకిళ్లను 90 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కంపెనీ చేతక్‌ను 2020లో ఎలక్ట్రిక్ అవతార్‌లో తిరిగి ప్రవేశపెట్టింది. ప్రత్యామ్నాయ శక్తి వనరుపై వ్యాఖ్యానిస్తూ, శర్మ మాట్లాడుతూ, “CNG అనేది పర్యావరణ హితమైనది.. తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. CNGతో నడిచే వాహనాలు ముడి దిగుమతులను తగ్గించే ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ఉన్నాయి. . 2025 నాటికి 8,000 CNG స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇలా CNG స్టేషన్లు వేగంగా పెరగడం కూ శుభపరిణామం.
CNG vs Petrol : CNG car లేదా పెట్రోల్ car.. రెండింటిలో ఏది మంచిది?
అయితే.. పెట్రోల్ బైక్స్‌తో పోల్చుకుంటే.. ఈ సీఎన్జీ ద్విచక్రవాహనల ధర కాస్త ఎక్కువే ఉండవచ్చని తెలుస్తోంది. ఈ వాహనాల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండడం ఒక కారణం కావొచ్చు. సీఎన్జీ బైక్స్ కోసం ఫ్యూయెల్ ట్యాంక్స్‌ని ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్‌లో పెట్రోల్, సీఎన్జీ.. రెండు ఆప్షన్స్ ఉండాలి.. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
Bajaj Auto CNG bikes launch date : అయితే ఈ సీఎన్జీ బైక్స్ పూర్తిగా కొత్తగా ఉంటాయా? లేక ఇప్పుడున్న బైక్ మోడల్స్‌కి సీఎన్జీ రూపంలోకి తీసుకొస్తుందా? అనేది తెలియరాలేదు. ప్రస్తుతం మార్కెట్లో అనేక సీఎన్జీ కార్లు, త్రీ వీలర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దాదాపు అన్ని.. ఐసీఈ ఇంజిన్ మోడల్స్‌కి సీఎన్జీ రూపంలోకి తీసుకొచ్చినవే ఉన్నాయి.!
Bajaj Auto latest bikes launch : “బజాజ్ ఆటో కేవలం ఒక్క బైక్‌ని మాత్రమే ప్రారంభించబోదు.. ఈ సెగ్మెంట్లో వివిధ ద్విచక్రవాహనాలను లాంచ్ చేస్తున్నామని,. సీఎన్జీ మోటార్‌సైకిల్స్ కోసం ప్రత్యేకంగా ఓ పోర్ట్‌ఫోలియో ఉండాలన్నదే మా ఆలోచన అని శర్మ వివరించారు.
బజాజ్ తీసుకొచ్చే సీఎన్జీ బైక్.. పెట్రోల్ నుంచి CNG మారిపోయే సాంకేతికతను కలిగి ఉంటుంది. త్రీవీలర్లు, కార్ల మాదిరిగా కాకుండా మోటార్ సైకిళ్లలో CNG ట్యాంకులపై అనేక పరిశోధనలు అవసరం. సిఎన్‌జితో నడిచే మోటార్‌సైకిళ్ల ధర తమ పెట్రోల్ కౌంటర్‌పార్ట్‌ల కంటే ఎక్కువగా ఉంటుందని శర్మ చెప్పారు. ద్వి ఇంధన వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..