Bajaj Chetak vs TVS iQube | బజాజ్ చేతక్ 3202 ఈవీ.. TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?
Bajaj Chetak Blue 3202 vs TVS iQube | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన దిగ్గజాల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. TVS మోటార్, బజాజ్ చేతక్ స్కూటర్లు వరుసగా రెండు మూడవ స్థానంలో ఉన్నాయి. బజాజ్ తాజాగా చేతక్ బ్లూ 3202 విడుదల చేయగా , TVS మోటార్స్ iQube 3.4 kWh మిడిల్ రేంజ్ మోడల్ తో మార్కెట్ లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను పోల్చి చూద్దాం.
స్పెసిఫికేషన్‌లు
Bajaj Chetak Blue 3202 vs TVS iQube చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ 16 Nm టార్క్‌తో 5.3 bhp తో 3.2 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ప్రీమియం వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. బజాజ్ ఆటో ప్రకారం EV స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 137 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా 63 kmph వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల 50 నిమిషాలు పడుతుంది. 5...