బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో చూశారా?
త్వరలో విడుదల కానున్న Bajaj Electric three wheeler
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ఆటోబజాజ్ ఆటో నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ వాహనం ప్యాసింజర్, కార్గో వెహికల్ కేటగిరీలు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి కంపెనీ గత ఏడాది Bajaj Electric three wheeler (ఎలక్ట్రిక్ త్రీ-వీలర్) ను విడుదల చేయాలని భావించింది. అయితే వినియోగదారుల భద్రత కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింది.బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. వాణిజ్య వినియోగదారులకు స్థిరమైన, అనుకూలమైన ప్రొడక్ట్‌లను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ Bajaj Electric three wheeler “FAME ఆమోదం పొందింది. అలాగే ARAI సర్టిఫికేషన్ కూడా మంజూరు అయింది. రాబోయే వారాల్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.FY2025 నాటికి ...