విస్తరణ దిశగా BattRE Ev స్టార్టప్
దేశవ్యాప్తంగా 300 డీలర్‌షిప్‌లు2023 నాటికి 700కు చేరువ..భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV స్టార్టప్‌లలో ఒకటి BattRE Ev కంపెనీ. ఇప్పటివరకు 19 రాష్ట్రాల్లో 300 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది. FY23 పూర్తయ్యే నాటికి 700 డీలర్‌షిప్‌లను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. బ్యాట్రే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా రెండు సరికొత్త ప్రోడక్ట్‌లు వచ్చి చేరాయి. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. భవిష్యత్తులోనూ BattRE సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకురానుంది.
300శాతం పెరిగిన ఆదాయం
కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 450 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలని యోచిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని ఆదాయంతో పోలిస్తే 300 శాతం పెరిగింది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడానికి, డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి,...