BattRE Storie Electric Scooter భలే ఆఫర్
కేంద్రం సబ్సిడీ తగ్గించినా అందుబాటు ధరలోనే..
ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ భారీగా తగ్గించింది. ఫలితంగా అన్ని ఈవీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు దాదాపుగా రూ.1.40లక్షలకు పైగా ఉన్నాయి. అయితే ప్రముఖ ఈవీ కంపెనీ BattRE (బ్యాట్రే) తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను తగ్గించింది. BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ (Batt:RE) ఇ-మొబిలిటీ సంస్థ అర్బన్ వాహనదారుల కోసం క్యూట్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు కలిగిన పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ పోర్ట్ పోలియోలోని అత్యధిక ప్రజాదరణ పొందిన BattRE Storie Electric Scooter మోడల్ పై ఆఫర్ ను ప్రకటించడం విశేషం. ఈ ఆఫర్ 2023 జూలై 30 వరకు అందుబాటులో ఉంది.
BattRE Storie Electric Scooter స్పెసిఫికేషన్
ఈ స్కూటర్ దృఢమైన మెటల్ ప్యానెల్‌లతో రూపొందంచబడింది. 5-అంగుళాల బ్లూటూత్ TFT స్మార్ట...