EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్యలు తొలగించేందుకు Tata ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) కీలక అడుగు వేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 7,000 భారత్ పెట్రోలియం పెట్రోల్ పంపుల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఈ రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.Tata EV యజమానులు పబ్లిక్ ప్రదేశాలలో ఛార్జర్‌లను ఏర్పాటు చేయడానికి గాను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చెందిన పెట్రోల్ బంకులను ఉపయోగించుకుంటాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వచ్చే ఏడాది నాటికి 7,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహ...