Thursday, July 3Lend a hand to save the Planet
Shadow

Tag: Congress Govt

ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

Agriculture
Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే సమయం వంటి ముఖ్యమైన వివరాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్సప్ నంబరు ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన ఈ వాట్సప్ యాప్ ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పత్తిని విక్రయించుకోవాలని రైతులను కోరారు. అలాగే, రైతులకు ఎటువంటి ఫిర్యాదు ఉన్నా వాట్సప్ ద్వారా సమాచారమిస్తే.. మార్కె...
TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

General News, Green Mobility
TGSRTC Electric Buses | హైదరాబాద్ మహానగరం క్రమంగా డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్ లో   హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామ‌ని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  వెల్లడించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి ర‌వాణా, బిసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.pic.twitter.com/bh69GJsWiY — VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 29, 2024ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సు (TGSRTC Electric Buses) ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం మా...
Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..

Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..

General News
Agri News  | తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోన‌స్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. మ‌రోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్‌ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సోమ‌వారం సెప్టెంబర్ 16 సచివాలయంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ భేటీ అయిన సబ్ కమిటీ.. రేషన్, హెల్త్ కార్డుల జారీ విధివిధానాలపై చ‌ర్చ‌లు జ‌రిపింది.ఈ స‌మావేశం అనంతరం స‌మావేశంలో తీసుక‌న్న నిర్ణ‌యాల‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాకు వెల్ల‌డించారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అన్న‌దాత‌ల‌కు ...
TGSRTC Electric Buses | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో రోడ్లపైకి వెయ్యి కొత్త బస్సులు..  ఈ రూట్లలోనే.. ..

TGSRTC Electric Buses | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో రోడ్లపైకి వెయ్యి కొత్త బస్సులు.. ఈ రూట్లలోనే.. ..

General News
TGSRTC Electric Buses |  హైదరాబాద్ : ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించిన 13 ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దశలవారీగా డెలివరీ చేయబోయే ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) మోడల్‌లో పనిచేస్తాయి. ఈ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య మోడల్‌లో ఎలక్ట్రిక్ వాహన సరఫరాదారులకు నిర్వహణ కోసం కిలోమీటరు ప్రాతిపదికన చెల్లింపు ఉంటుంది. వీటిలో 500 కంటే ఎక్కువ బస్సులు సిటీ రూట్లలో సేవలు అందించనున్నాయి. ఈ రూట్లలోనే కొత్త బస్సులు.. TGSRTC Electric Buses : ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్‌సీయూ, హయత్‌నగర్-2, రాణిగంజ్, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్-2, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్-2...