Kharif Season | దెబ్బతీసిన వర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు
Kharif Season | హైదరాబాద్ : ఈ వనకాలం (ఖరీఫ్) సీజన్‌లో తెలంగాణలో పంటల సాగు తీవ్రంగా పడిపోయింది.మొత్తం పంట విస్తీర్ణం దాదాపు 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 1.29 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 1.28 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు. సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాల కంటే తక్కువ సమయం ఉంది. మొత్తం పంట విస్తీర్ణం ఇప్పటికిప్పుడు మెరుగుపడే అవకాశం లేదు. గతేడాది సమయానికి పంటలకు సరిపడా…