
Electric Bus | త్వరలో ఈ నగరానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు
Delhi | ఈనెలలో దేశ రాజధానికి 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు (Electric Bus ) వస్తాయని ఢిల్లీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ ప్రస్తుతం రూ.235 కోట్ల నష్టంలో ఉందని సింగ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రభుత్వం ఒక ప్రణాళికపై పనిచేస్తోందని, ఏడాదిలోపు దిల్లీ రవాణా సంస్థను లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అన్నారు."ఈ నెలలో మేము ఢిల్లీలో 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తాం" అని పంకజ్ కుమార్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని రేఖ గుప్తా ప్రభుత్వంలోని ఆరుగురు క్యాబినెట్ మంత్రులలో ఒకరైన సింగ్ ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాల్సిన ఉందని రవాణా, ఆరోగ్య, ఇతర శాఖల మంత్రి సింగ్ చెప్పారు. "ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం తగ్గించేలా మనం ప్రజా రవాణాను మెరుగుపరచాలి" అని సింగ్ అన్...