ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ
discount on Okaya EV scooters | ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన Okaya EV ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ ఫిబ్రవరి 29, 2024 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 18,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఫలితంగా Okaya ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ల ధరలు ఇప్పుడు కేవలం రూ. 74,899 నుంచి ప్రారంభమవుతాయి.Also Read : టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. లక్షల్లో డిస్కౌంట్తాజా ఆఫర్ పై ఒకాయ EV మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అన్షుల్ గుప్తా స్పందిస్తూ.. మధ్యతరగతి వినియోగదారులకు అనుగుణంగా మేము మా అన్ని స్కూటర్లపై ధరలను గణనీయంగా తగ్గించాము. ఈ చర్య వల్ల EV ధరలపై కస్టమర...