
discount on Okaya EV scooters | ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన Okaya EV ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ ఫిబ్రవరి 29, 2024 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 18,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఫలితంగా Okaya ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ల ధరలు ఇప్పుడు కేవలం రూ. 74,899 నుంచి ప్రారంభమవుతాయి.
Also Read : టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. లక్షల్లో డిస్కౌంట్
తాజా ఆఫర్ పై ఒకాయ EV మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అన్షుల్ గుప్తా స్పందిస్తూ.. మధ్యతరగతి వినియోగదారులకు అనుగుణంగా మేము మా అన్ని స్కూటర్లపై ధరలను గణనీయంగా తగ్గించాము. ఈ చర్య వల్ల EV ధరలపై కస్టమర్‌లకు టెన్షన్ అవసరం లేదు. తక్కువ ధరల్లో ఈవీలు అందుబాటులోకి వస్తే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగవంతమవుతుంది. ఈ చొరవ EV అడాప్షన్‌ను ముందుకు నడిపిస్తుంది, సమీప భవిష్యత్తులో ముఖ్యమైన మైలురాళ్లను సాధించగలమని మేము విశ్వసిస్తున్నాము. అని పేర్కొన్నారు.
లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ
discount on Okaya EV scooters : Okaya నుంచి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతలు గల భారతీయ వాతావరణ పరిస్థితుల్లో సురక్షితమైనవిగా భావిస్తున్నారు. NMC బ్యాటరీలతో పోలిస్తే LFP బ్యాటరీలు ఎక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి, భద్రత, అధిక ఉష్ణోగ్రతలలో సరైన పనితీరు, మెరుగైన ఛార్జ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్లు BLDC హబ్ మోటారుతో వస్తాయి. అలాగే ఈ స్కూటర్లు IP67 వాటర్‌ప్రూఫ్ , డస్ట్-రెసిస్టెంట్ ఫీచర్‌లతో వస్తాయి. దీని వల్ల వర్షాకాలంలో ఈ స్కూటర్లను ఏ ఆందోళన లేకుండా నడపవచ్చు.
[table id=23 /]
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
👍👍👍
I would like to know how to get this vehicle
How can I pay my installment amount
It’s better if you buy from ADMS electric vehicle, because they offer income and bonus with the product, which no other brand does this, so it’s a good opportunities to buy ADMS
[…] 29, 2024 వరకు చెల్లుబాటలో ఉంటుంది. ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్లు ఇప్పుడు […]