E20 Fuel Benefits : E20 ఇంధనం ఏమిటి? ఈ కొత్త పెట్రోల్ తో వాహనాల మైలేజీ, ధర ఎంత వివరాలు ఇవే..
E20 Fuel Benefits | ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో మన భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడేస్తుండడంతో కాలుష్యం పెరిగిపోయి పర్యావరణం దెబ్బతిని ఊహించని విపత్తులను మనం చూస్తునే ఉన్నాం.. అయితే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనం, పునరుత్పాదక ఇంధన వనరులను అన్వేషిస్తోంది. భారత్ 2030 నాటి తన పునరుత్పాదక ఇంధన మిషన్‌కు కట్టుబడి ఉంది. కొత్తగా ఇప్పుడు E20 పేరుతో కొత్త పర్యావరణ హితమైన ఇంధనంపై ఎక్కువగా చర్చ నడుస్తోంది. క్రమంగా పెట్రోల్ స్థానంలో E20 ఫ్యూయల్ ను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇది భారత ప్రభుత్వానికి చమురు దిగుమతులు పెరగకుండా ఉపశమనం కల్పిస్తుంది. కానీ దీని వల్ల వినియోగదారులకు లాభం ఏమిటీ ? ఇది మీ వాహనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కొత్తగా వెలుగులోకి వస్తున్న E20 ఇంధనం గుర...