Electric Highway | ఎలక్ట్రిక్ హైవేలు మీకు తెలుసా.. రోడ్లపై ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..!
Electric Highway | రవాణా రంగం భవిష్యత్ క్రమంగా మారిపోతోంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అందరూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేందుకు సబ్సిడీలు అందిస్తూ వినియోగదారులను ప్రోత్సహిస్తోంది.
ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఇవి ఎక్కువగా హైవేలపై తరచూ కనిపిస్తుంటాయి. వీటికి పెద్ద మొత్తంలో కరెంట్ అవసరమవుతుంది.
అయితే మధ్యలో ఛార్జింగ్ ఐపోయినా లేదా ఛార్జింగ్ కోసం ఎక్కడైనా ఆగినా చాలా సమయం వృథా అవుతుంది. దీనివల్ల విద్యుత్ తో నడిచే భారీ ట్రక్కులపై వినియోగదారులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే ఇలాంటి ఇబ్బందులు అధిగమించేందుకు ఎక్కువగా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రిక్ హైవేలను ఏర్పాటు చే...