EV sector లో 2030 నాటికి కోటి ప్రత్యక్ష ఉద్యోగాలు
సగటు ఉద్యోగుల వృద్ధిలో 108% ఉందని సర్వే
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమ (EV sector )దూసుకుపోతోంది. ఈ రంగంలో ఉపాధిలో గణనీయమైన వృద్ధి కనిపించిందని ఒక సర్వేలో గుర్తించారు. గత రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య సగటు వృద్ధి 108% వరకు చేరిందని తేలింది.స్టాఫింగ్, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ CIEL HR సర్వీసెస్ తన తాజా సర్వేలో ఒక సంవత్సరం, ఆరు నెలల కాలంలో, వరుసగా 35% , 13% వృద్ధిని నమోదు చేసినట్లు గుర్తించింది. నాయకత్వ స్థానాల్లోకి మహిళలు వేగంగా అభివృద్ధి చెందుతున్నారని కూడా పేర్కొంది.అయితే 62% ఉద్యోగ నియామకాలతో బెంగళూరు ముందుంది, ఢిల్లీలో 12%, పూణేలో 9%, కోయంబత్తూరులో 6% , చెన్నైలో 3% ఉన్నాయి.
‘Latest employment trends in EV sector 2022’ పేరుతో 52 కంపెనీల్లో విస్తరించి ఉన్న 15,700 మంది ఉద్యోగులపై సర్వే నిర్వహించబడింది. EV సెక్టార్‌లో ఇంజినీరింగ్ విభాగం ముందుందని, ఆ తర్వాత ఆపరేషన్, సేల్స్...