రూ.10,900 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్తగా సబ్సిడీ పథకం
PM E-DRIVE subsidy scheme | దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు, ఛార్జింగ్ మౌలికళ వసతుల కల్పనకు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.10,900 కోట్లతో ‘పీఎమ్ ఇ-డ్రైవ్’ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా ఏప్రిల్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలయిన EMPS-2024 (ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్) పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో PM E-DRIVE పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త పథకం 2024 అక్టోబరు 1 నుంచి 2026 మర్చి 31 వరకు అమలులో ఉండనుంది.
ఈవీలపై సబ్సిడీ ఇలా..
విద్యుత్ ద్విచక్ర వాహనాలకు వాటిలో వినియోగించే బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. కిలోవాట్ అవర్‌కు రూ.5,000 సబ్సిడీ అందించనున్నారు. మొత్తం సబ్సిడీ తొలి ఏడాదిలో రూ.10,000ను మించదు. రెండో
సంవత్సరం కిలోవాట్‌కు రూ.2,500 చొప్పున ఉంటుంది. అయితే మొత్తం ప్...