Skellig Lite e-cycle విడుదల
GoZero కంపెనీ ఇండియాలో ఓ ఎలక్ట్రిక్ సైకిల్‌ను లాంఛ్ చేసింది. Skellig Lite e-cycle పేరుతో విడుదల చేసిన ఈ సైకిల్ ధర రూ.19,999 వద్ద ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ధరలో లభించే ఎలక్ట్రిక్ సైకిల్‌గా నిలిచిందని చెప్పవచ్చు.
Skellig Lite e-cycle స్పెసిఫికేషన్స్
గోజీరో సైకిల్ 25 కి.మీ రేంజిని కలిగి ఉంటుంది. గంటకు గరిష్టంగా 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. Skellig Lite e-cycle లో డిటాచబుల్ ఎనర్‌డ్రైవ్ 210 Wh లిథియం బ్యాటరీ ప్యాక్ ను వినియోగించారు. ఇక వెనుక చక్రానికి 250 W వెనుక హబ్-డ్రైవ్ మోటార్‌తో ఇది శక్తిని పొందుతుంది. GoZero డ్రైవ్ కంట్రోల్ 2.0 LED డిస్‌ప్లే యూనిట్ ద్వారా నియంత్రించబడుతుంది. ఇందులో మూడు పెడల్-అసిస్ట్ మోడ్‌లను ఎంచుకునే ఆప్షన్లు ఉన్నాయి. ఇందులోని బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటలే పడుతుంది. లైట్‌లో 26 × 1.95 టైర్లు, ప్రత్యేకమైన V- బ్రేక్‌ల...