ఒక్కసారి చార్జితో 170కి.మీ ప్రయాణించవచ్చు.. ప్యూర్ ఈవీ నుంచి ecoDryft 350 Electric bike విడుదల..
Pure EV ఈరోజు తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వేరియంట్, ecoDryft 350ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 1.30 లక్షలుగా ఉంది. ఆసక్తిగల కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్యూర్ EV అధీకృత డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు. 171 కిమీ ఛార్జ్‌తో, ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 110 సిసి కమ్యూటర్ సెగ్మెంట్లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని కంపెనీ తెలిపింది.బ్యాటరీ.. రేంజ్
Pure EV ecoDryft 350 ఎలక్ర్టిక్ బైక్ లో 3.5 kWh Li-ion బ్యాటరీతో 3kW ఇ-మోటార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 40Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం గంటకు 75 కిమీకి పరిమితం చేశారు. ప్యూర్ EV ecoDryft 350 ఒక్కసారి ఛార్జ్‌పై సుమారు 171 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. బైక్ ఛార్జింగ్ సామర్థ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు. అయి...