ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్
HOP Electric Mobility ఘనత
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మరోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల గురించి వినియోగదారులు తెలుసుకుంటున్నారు. పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థకు మారడానికి ఇది చక్కని అవకాశమని తెలిపారు.
HOP Electric Mobility (హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. అవి HOP LEO, HOP LYF. ఈ రెండు Electric Scooters (ఎలక్ట్రిక్ స్కూటర్‌లు) బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ అనే మూ...