రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు
దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు బూస్టింగ్
lithium reserves in Rajasthan : రాజస్థాన్ ప్రభుత్వం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దేగానా మునిసిపాలిటీ (Degana) పరిధిలో భారీగా లిథియం నిల్వలను గుర్తించించింది.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో కనుగొన్న 5.9 మిలియన్ టన్నుల కంటే ఈ నిల్వలు ఎక్కువ ఉన్నాయని జీఎస్ఐ తెలిపింది. రాజస్థాన్‌లో లభించే లిథియం పరిమాణం దేశ డిమాండ్ ను అవసరాలలో 80 శాతం తీర్చగలదని అధికారులు పేర్కొన్నారు. లిథియం ప్రపంచవ్యాప్తంగా తేలికైన మృదువైన లోహం. నాన్ ఫెర్రస్ మెటల్, ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. EV బ్యాటరీలలో కీలకమైన భాగాలలో ఒకటి.క్యాపిటల్ A వ్యవస్థాపకుడు & లీడ్ ఇన్వెస్టర్ అంకిత్ కేడియా మాట్లాడుతూ "ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం-అయాన్ బ్యాటరీలు అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన. తేలికైన బ్యాటరీ తయారీకి పయోగపడుతుంది. భారతదేశంలోన...