mXmoto M16 e-bike | అదిరిపోయే స్టైల్ లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ..
mXmoto M16 e-bike | భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ మరో ఎలక్ట్రిక్ బైక్ వచ్చి చేరింది. mXmoto M16 ఎలక్ట్రిక్ క్రూయిజర్, రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయింది. మరో ముఖ్యవిషయమేంటంటే.. కంపెనీ బ్యాటరీ ప్యాక్ పై ఏకంగా 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. అదిరిపోయే స్టైల్ తో వచ్చిన ఈ బైక్ యూత్ అమితంగా ఇష్ట పడతారు. ఎంఎక్స్ మోటో ఎం16లో ఎన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎం16 బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ బైక్ పూర్తి మెటల్ బాడీతో వస్తుంది. mXmoto M16 బైక్ వివరాలు ఇపుడు తెలుసుకుందాం..
mXmoto M16: డిజైన్
చాలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ల వంటి స్ట్రీట్ నేకెడ్‌ల మాదిరిగా కాకుండా, mXmoto ఒక క్రూయిజర్ మోడల్ లో నిర్మితమైంది. ICE విభాగంలో కూడా ఈ డిజైన్ లో గట్టి పోటీనిచ్చే బైక్స...