
కొత్త లోగోతో మహీంద్రా ప్రీమియం EV మోడళ్ల వచ్చేశాయి.. సింగిల్ చార్జిపై 650 కి.మీ మేలేజీ.. ధర, ఫీచర్లు ఇవే..
Mahindra BE 6e and XEV 9e | భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో సరికొత్త మార్పును తీసుకొస్తూ.. మహీంద్రా & మహీంద్రా ఈ రోజు తన 'బోర్న్ ఎలక్ట్రిక్' SUVలలో మొదటి రెండు వాటిని విడుదల చేసింది. BE 6e, ₹18.90 లక్షలతో లాంచ్ చేయగా, XEV 9e, ₹21.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇది అద్భుతమైన INGLO (ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ గ్లోబల్) ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది.డెలివరీలు ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి 2025 ప్రారంభంలో మొదలవుతాయి. జనవరి 2025లో దశలవారీ మార్కెట్ రోల్‌అవుట్ ప్రారంభమవుతుంది. అద్భుతమైన లైఫ్‌టైం బ్యాటరీ వారంటీ మొదటగా నమోదుచేసుకున్న వినియోగరులకు వర్తిస్తుంది. తదుపరి యజమానులు 10-సంవత్సరాలు/200,000 . కిమీ వరకు వారంటీ వర్తిస్తుంది.SUVలు మహీంద్రా "హార్ట్‌కోర్ డిజైన్" విలక్షణమైన డిజైన్ తో వస్తున్నాయి. BE 6e స్పోర్...