Wednesday, March 19Lend a hand to save the Planet
Shadow

కొత్త లోగోతో మహీంద్రా ప్రీమియం EV మోడళ్ల వచ్చేశాయి.. సింగిల్ చార్జిపై 650 కి.మీ మేలేజీ.. ధర, ఫీచర్లు ఇవే..

Spread the love

Mahindra BE 6e and XEV 9e | భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో స‌రికొత్త మార్పును తీసుకొస్తూ.. మహీంద్రా & మహీంద్రా ఈ రోజు తన ‘బోర్న్ ఎలక్ట్రిక్’ SUVలలో మొదటి రెండు వాటిని విడుదల చేసింది. BE 6e, ₹18.90 లక్షలతో లాంచ్ చేయ‌గా, XEV 9e, ₹21.90 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త అధ్యాయానికి తెర‌లేపింది. ఇది అద్భుతమైన INGLO (ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ గ్లోబల్) ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది.

డెలివరీలు ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి 2025 ప్రారంభంలో మొద‌ల‌వుతాయి. జనవరి 2025లో దశలవారీ మార్కెట్ రోల్‌అవుట్ ప్రారంభమవుతుంది. అద్భుతమైన లైఫ్‌టైం బ్యాటరీ వారంటీ మొద‌టగా న‌మోదుచేసుకున్న వినియోగ‌రుల‌కు వ‌ర్తిస్తుంది. తదుపరి యజమానులు 10-సంవత్సరాలు/200,000 . కిమీ వ‌ర‌కు వారంటీ వ‌ర్తిస్తుంది.

SUVలు మహీంద్రా “హార్ట్‌కోర్ డిజైన్” విలక్షణమైన డిజైన్ తో వస్తున్నాయి. BE 6e స్పోర్టీ డిజైన్ తో ఎడ్జీ, అథ్లెటిక్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. అయితే XEV 9e దాని సున్నితమైన SUV కూపే డిజైన్‌తో ఆధునిక హంగుల‌తో క‌నిపిస్తుంది. BE 6e 4371 x 1907 x 1627mm మరియు XEV 9e 4789 x 1907 x 1694mmతో రెండు వాహనాలు ఆకట్టుకునే కొలతలను క‌లిగి ఉన్నాయి. రెండూ 2775mm వీల్‌బేస్‌ను క‌లిగి ఉన్నాయి.

READ MORE  Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

స్పెసిఫికేష‌న్స్‌..

Mahindra BE 6e and XEV 9e : పనితీరు విష‌యానికొస్తే.. రెండు మోడల్స్ రెండు బ్యాటరీ ఆప్ష‌న్స్ తో వ‌స్తాయి. 79 kWh మరియు 59 kWh LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీలు. 79 kWh వేరియంట్ BE 6eకి 682 కిమీ (MIDC P1+P2) మరియు XEV 9eకి 656 కిమీల సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. ఇది భారతదేశంలోనే రేంజ్ ఇచ్చే వాహ‌నంగా నిలుస్తుంది.
3-ఇన్-1 ఇంటిగ్రేటెడ్ పవర్‌ట్రెయిన్ 210 kW పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 175 kW ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 20 నిమిషాలలోపు 20-80% ఛార్జింగ్ చేయవచ్చు.

READ MORE  Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

ఇంటీరియర్ విషయానికొస్తే.. వినోదం కోసం, మోడల్‌లు “సోనిక్ స్టూడియో ఎక్స్‌పీరియన్స్ బై మహీంద్రా”తో వస్తాయి, డాల్బీ అట్మోస్‌తో 1,400-వాట్, 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సెటప్‌ను కలిగి ఉంది.

ఈ వాహనాలు 5 రాడార్లు, 1 విజన్ కెమెరాతో ADAS లెవ‌ల్‌ 2+తో సహా అధునాతన సెక్యూరిటీ సిస్ట‌మ్ కలిగి ఉంటాయి. “Secure360” సిస్టమ్ 360-డిగ్రీ కెమెరాలు, ఇన్-క్యాబిన్ మానిటరింగ్‌తో సమగ్ర నిఘాను అందిస్తుంది. “ఆటోపార్క్” ఫీచర్ వివిధ పార్కింగ్ సిస్టం కోసం 12 అల్ట్రాసోనిక్ సెన్సార్‌లను ఉపయోగించుకుంటుంది.

మహీంద్రా XEV 9e నిటారుగా ఉండే బానెట్, మహీంద్రా ఇల్యూమినేటెడ్ ఇన్ఫినిటీ లోగోతో ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది నిలువుగా పేర్చబడిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, LED ఫాగ్ ల్యాంప్‌లు, ఎయిర్ ఇన్‌లెట్‌తో కూడిన బ్లాక్ లోయర్ బంపర్‌లోకి LED DRLలను కనెక్ట్ చేసింది. సైడ్ ప్రొఫైల్‌లో స్లోపింగ్ రూఫ్‌లైన్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వీల్ ఆర్చ్‌ల వెంట బ్లాక్ క్లాడింగ్ ఉన్నాయి. బాడీ కలర్డ్ ORVMలు, డ్యూయల్-టోన్ ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ అద్భుతంగా కనిపిస్తుంది. వెనుక వైపు కనెక్ట్ చేయబడిన ఇన్‌వర్టెడ్ U- ఆకారపు LED టెయిల్ లైట్, టెయిల్‌గేట్‌పై క్రోమ్-యాక్సెంటెడ్ బ్లాక్ బంపర్‌తో ఇల్యూమినేటెడ్ ఇన్ఫినిటీ లోగో ఉన్నాయి.

READ MORE  Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..